ABP Cvoter Exit Poll in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి ఓ వైపు, వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ మరో వైపు హోరాహోరీగా పోరాడారు. అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల కాంగ్రెస్ తరపున తన పార్టీని బలంగా నిలబెట్టేలా తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తెలుసుకునేందుకు ఏబీపీ - సీఓటర్ ఎగ్జిట్ పోల్ నిర్వహించింది. ఆ ఎగ్జిట్ పోల్‌లో ఊహించని అంచనాలు వెలువడ్డాయి.
దేశంలోని అత్యంత ఎక్కవ యాక్యురసీ ఉన్న ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తూ వస్తోంది ఏబీపీ సీఓటర్. ఈ సారి కూడా ప్రజా నాడిని పూర్తి స్థాయిలో అంచనా వేసేందుకు ప్రయత్నించింది. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం ఖాయమని అంచనా వెల్లడయింది.
ముందుగా ఓటు షేర్ ఏ ఏ పార్టీలకు ఎంత వచ్చిందో చూద్దాం. ఏపీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అత్యధికంగా 52.9 శాతం ఓట్లు సాధిస్తుందని ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. తర్వాత వైఎస్ఆర్‌సీపీకి 41.7 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే వైఎస్ షర్మిలా రెడ్డి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని కొంత మెరుపరిచారు. గత ఎన్నికల్లో ఒక్క శాతం కన్నా తక్కువే ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి మెరుగైన ఓట్లు సాధించబోతోంది. ఈ సారి 3.3 శాతం ఓట్లు వస్తాయని ఏబీపీ - సీఓటర్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. ఇతరులు 2.1 శాతం ఓట్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.
సీట్ల ప్రకారం చూస్తే.. 52.9 శాతం ఓట్లు సాధిస్తున్న ఎన్డీఏ కూటమి ఆటోమేటిక్ గా స్వీప్ చేయంగా కనిపిస్తోంది. మొత్తం ఇరవై ఐదు లోక్ సభ సీట్లలో 21 నుంచి 25 సీట్లు కూటమి పార్టీలు సాధించే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్‌సీకి 0 నుంచి 4 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది. అంటే వైఎస్ఆర్‌సీపీ ఖచ్చితంగా గెలిచే లోక్ సభ సీటు ఒక్కటి కూడా లేదని ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది.
ఏబీపీ - సీఓటర్ ఎగ్జిట్ పోల్ పూర్తిగా లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించినదే. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ లోక్ సభ సీట్ల నిష్పత్తిలోనే అసెంబ్లీ సీట్లను కూడా.. కూటమి , వైఎస్ఆర్‌సీపీ గెలుచుకునే అవకాశాలు ఉంటాయని అంచనా వేసుకోవచ్చు.
[DISCLAIMER: Current survey findings and projections are based on CVoter Exit Poll / Post Poll personal interviews conducted on polling day and after polling day among 18+ adults statewide, all confirmed voters, details of which are mentioned right below the projections as of today. The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. Our final data file has Socio-Economic profile within +/- 1% of the Demographic profile of the State. We believe this will give the closest possible trends. The sample spread is across all Assembly segments in the poll bound state. MoE is +/- 3% at macro level and +/- 5% at micro level VOTE SHARE projection with 95% Confidence interval.]