Fact Check ABP Cvoter ExitPoll 2024: దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన ఎగ్జిట్ పోల్స్ ప్రకటించే ఏబీపీ-సీఓటర్ సంస్థ పేరును కొన్ని రాజకీయ పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలపై ఏబీపీ- సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ అంచనాలను వెల్లడించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 21 నుంచి 25 స్థానాలను గెలుచుకుంటుందని ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్‌లో అంచనాలను వెల్లడయ్యాయి. అదే విషయాన్ని ఏబీపీ దేశం కూడా ప్రకటించింది. ఆ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కింద కింద డీటైల్డ్ గ్రాఫిక్ ప్లేట్‌లో చూడవచ్చు.
అయితే కొంత మంది ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా ఏబీపీ సీఓటర్ రిలీజ్ చేసిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందులో వైఎస్ఆర్‌సీపీకి ఆధిక్యం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఏబీపీ ఎగ్జిట్ పోల్స్ ను ఓ తెలుగు టీవీ చానల్ ప్రసారం చేసినట్లుగా మార్ఫింగ్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు. కానీ ఏబీపీ సీఓటర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించలేదు. వాట్సాప్‌లలో చేస్తున్న ప్రచారం అంతా ఫేక్.
సర్వేలు, ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ లో ఏబీపీ -సీఓటర్ విశ్వసనీయతను తమ రాజకీయ లబ్ది కోసం కొన్ని పార్టీలు వాడకునే ప్రయత్నం చేస్తున్నాయి. లోక్ సభ స్థానాల్లో ఏపీలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏకపక్షంగా ఉన్నట్లుగా తేలింది. వాటి వివరాలు
ఆంధ్రప్రదేశ్ లోక్ సభ స్థానాలకు మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ స్థానాలకు ఏబీపీ-సీఓటర్ ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం ఖాయమని అంచనా వెల్లడయింది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అత్యధికంగా 52.9 శాతం ఓట్లు సాధిస్తుందని ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. తర్వాత వైఎస్ఆర్‌సీపీకి 41.7 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే వైఎస్ షర్మిలా రెడ్డి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని కొంత మెరుపరిచారు. గత ఎన్నికల్లో ఒక్క శాతం కన్నా తక్కువే ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి మెరుగైన ఓట్లు సాధించబోతోంది. ఈ సారి 3.3 శాతం ఓట్లు వస్తాయని ఏబీపీ - సీఓటర్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. ఇతరులు 2.1 శాతం ఓట్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.
సీట్ల ప్రకారం చూస్తే.. 52.9 శాతం ఓట్లు సాధిస్తున్న ఎన్డీఏ కూటమి ఆటోమేటిక్ గా స్వీప్ చేయంగా కనిపిస్తోంది. మొత్తం ఇరవై ఐదు లోక్ సభ సీట్లలో 21 నుంచి 25 సీట్లు కూటమి పార్టీలు సాధించే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్‌సీకి 0 నుంచి 4 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది. అంటే వైఎస్ఆర్‌సీపీ ఖచ్చితంగా గెలిచే లోక్ సభ సీటు ఒక్కటి కూడా లేదని ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది.
ఏబీపీ - సీఓటర్ ఎగ్జిట్ పోల్ పూర్తిగా లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించినదే. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ లోక్ సభ సీట్ల నిష్పత్తిలోనే అసెంబ్లీ సీట్లను కూడా.. కూటమి , వైఎస్ఆర్‌సీపీ గెలుచుకునే అవకాశాలు ఉంటాయని అంచనా వేసుకోవచ్చు.