ఎన్‌సీసీ క్యాడెట్లకు యూనిఫామ్‌ భత్యాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం (జులై 7) ప్రకటించింది. సదరు భత్యాన్ని జమ చేసే నిమిత్తం జీరో బ్యాలెన్స్‌ బ్యాంక్‌ ఖాతాలను క్యాడెట్ల పేరిట తెరుస్తారు. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమక్షంలో ఎన్‌సీసీ, భారతీయ స్టేట్‌ బ్యాంక్‌(ఎస్‌బీఐ) ఒక పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.


‘పహ్లీ ఉడాన్‌’ పథకం కింద ఎన్‌సీసీ క్యాడెట్లు అందరికీ ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్‌ ఖాతాలను తెరుస్తుంది. క్యాడెట్లకు డెబిట్‌ కార్డు, చెక్‌ బుక్‌, పాస్‌బుక్‌ అందుతాయి. తాజా పథకం కింద ప్రతి ఏడాది దాదాపు ఐదు లక్షల మంది క్యాడెట్లు లబ్ది పొందుతారు.


క్యాడెట్ల శిక్షణకాలం పూర్తి కావడం లేదా వారికి 18 సంవత్సరాలు పూర్తి కావడంలో ఏది ముందు పూర్తవుతుందో అప్పటివరకు జీరో బ్యాంక్‌ ఖాతాలు పనిచేస్తాయి. తద్వారా క్యాడెట్లకు జాతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థను పరిచయం చేయడంతోనే సరిపుచ్చక, వారి ఖాతాల్లోకి ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా పొందే ప్రయోజనాలు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ(టీబీడీ) ద్వారా జమ అవుతాయి.


ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ ఎన్‌ఐసీ, డీబీటీలను పరిచయం చేయడం ద్వారా ఎన్‌సీసీ డిజిటలైజేషన్‌కు తమ వంతు కృషి చేస్తున్న ఎన్‌సీసీ, బీఐఎస్‌ఏజీ, ఎస్‌బీఐలను అభినందించారు.


ALSO READ:


తెలంగాణలో మ‌రో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి
తెలంగాణలో మ‌రో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. కోర్ గ్రూపుల్లో సీట్లు వెన‌క్కి ఇస్తామ‌ని పేర్కొంటూ ఇంజినీరింగ్ కాలేజీలు కంప్యూట‌ర్ కోర్సుల్లో సీట్లకు అనుమ‌తి కోరాయి. దీంతో 6,930 సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చింది. అలాగే కొత్తగా 7,635 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి ఖరారు చేసింది. ఫ‌లితంగా అద‌న‌పు సీట్లతో ఏటా స‌ర్కారుపై రూ. 27.39 కోట్ల భారం ప‌డ‌నుంది. ఇటీవ‌ల 86,106 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి ఇవ్వగా, తాజాగా అనుమ‌తిచ్చిన వాటితో క‌లిపి రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 1,00,671కి చేరింది.
సీట్ల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?
తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. రాష్ట్రంలోని అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి తుది గడువును జూన్ 25 వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ జులై 1న ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు పొందిన కళాశాలల్లోనే ప్రవేశాలు తీసుకోవాలని,  ఆయా కాలేజీల జాబితా బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులకు మిత్తల్ సూచించారు. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా.. ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు నవీన్‌మిట్టల్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటర్‌ సప్లిమెంటరీ విద్యార్థులకు మరో అవకాశం, సీఎస్‌ఏబీ కీలక నిర్ణయం!
జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించినా.. ఇంటర్మీడియట్‌లో 75 శాతం మార్కులు రానివారికి ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశం లభించదు. ఇలాంటివారి కోసం జోసా కౌన్సెలింగ్‌ నిర్వహణకు అధికారులు ఓ అవకాశం కల్పించారు. దేశవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌, ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణులై, 75 శాతంలోపు మార్కులు వచ్చినవారు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసి మార్కులు పెంచుకుంటే ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీటు లభిస్తుంది. జోసా కౌన్సెలింగ్‌కు హాజరైనప్పుడుగానీ, ప్రవేశాల సందర్భంలో గానీ  మార్కుల జాబితా సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్‌ పరీక్షల సమయంలో అనారోగ్యం, ఇతర కారణాలతో సరిగా పరీక్ష రాయలేక తక్కువ మార్కులు పొందిన ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఈ అవకాశం కల్పించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial