Wildlife Institute of India MSc Admissions: డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 2024-26 విద్యాసంవత్సరానికి సంబంధించి 20వ బ్యాచ్ ఎంఎస్సీ(వైల్డ్‌లైఫ్ సైన్స్) కోర్సు, మొదటి బ్యాచ్ ఎంఎస్సీ(ఫ్రెష్ వాటర్ ఎకాలజీ అండ్ కన్జర్వేషన్) కోర్సులో ప్రవేశాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ కోర్సులకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 30 వరకు ఆన్‌లైన్ విధానంలో విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవేశాల్లో నెట్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. దీంతోపాలు పర్సనాలిటీ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు..
1) మొదటి బ్యాచ్ ఎంఎస్సీ(ఫ్రెష్ వాటర్ ఎకాలజీ అండ్ కన్జర్వేషన్) కోర్సు
అర్హత: లైఫ్ సైన్స్ బ్యాచిలర్ డిగ్రీ (బాటనీ, జువాలజీ, వైల్డ్‌లైఫ్ సైన్సెస్/ ఫారెస్ట్రీ సబ్జెక్టుల్లో ఒకటి) లేదా వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ సైన్స్, సస్టైనబుల్ డెవలప్‌మెంట్, బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అనుబంధ సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నెట్ అర్హత ఉండాలి.
2) 20వ బ్యాచ్ ఎంఎస్సీ(వైల్డ్‌లైఫ్ సైన్స్) కోర్సు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (లైఫ్ సైన్సెస్, మెడికల్ సైన్స్, ఇంజినీరింగ్, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫార్మసీ, సోషల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి. నెట్ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 30.03.2024 నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఫారెస్ట్, వైల్డ్‌లైఫ్ విభాగాల్లో పనిచేస్తున్న అభ్యర్థులకు 35 సంవత్సరాల వరకు వయోపరిమితి వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.1500, ఇతరులు రూ.1000 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: నెట్ స్కోరు, పర్సనాలిటీ, ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 20.02.2024.
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 30.03.2024.
Notification (XX M.Sc. Course):
Notification (First Batch of M.Sc. Course):
ALSO READ:
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్, కోర్సు వివరాలు ఇలా
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, 2024-2026 విద్యా సంవత్సరానికి ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 75 సీట్లను భర్తీచేయనున్నారు. ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీతోపాటు క్యాట్-2023 ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. క్యాట్-2023 స్కోర్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు జనవరి 31లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..
బిట్స్ పిలానీలో ఎంబీఏ ప్రోగ్రామ్, కోర్సు వివరాలు ఇలా
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) పిలానీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రామ్‌లో (MBA Admissions) ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.