తెలంగాణలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎంసెట్‌లో మళ్లీ ఇంటర్ మార్కులకు వెయిటేజీని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీని రద్దుచేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో.. మళ్లీ ఇంటర్ మార్కుల వెయిటేజీ వ్యవహారం చర్చలోకి వచ్చింది. ఇప్పుడున్న మాదిరిగానే ఇంటర్‌తో సంబంధం లేకుండా ఎంసెట్ మార్కుల ఆధారంగానే ర్యాంకులను ప్రకటిస్తారా? లేదా మార్కుల వెయిటేజీ అములు చేస్తారా? అన్న విషయంపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.
ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ అంశంపై తుది నిర్ణయం తీసుకోవడానికి అధికారులు కసరత్తును మొదలుపెట్టారు. రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. ఈ పరీక్షల్లో ఎంసెట్ అత్యంత ముఖ్యమైనది కావడంతో దానిపై ముందుగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. కరోనాకు ముందు ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండేది. ఎంసెట్ పరీక్షలో వచ్చే మార్కులకు 75 శాతం, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పించి... ఆ మేరకు ర్యాంకులను ప్రకటించేవారు. ఈ విధానంతో ఇంటర్మీడియట్ పరీక్షలకు ప్రాధాన్యం పెరిగింది. అయితే కరోనా కారణంగా ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు కావడం, కొన్నిసార్లు 70 శాతం సిలబ్‌సతోనే పరీక్షలు నిర్వహించాల్సి రావడంతో... ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీని రద్దుచేశారు. అయితే ప్రస్తుతం మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్‌లో 100 శాతం సిలబ్‌సను అమలు చేస్తున్నారు. అదేవిధంగా వార్షిక పరీక్షలను కూడా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. దాంతో ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు మళ్లీ వెయిటేజీని ఇచ్చే విషయంపై అధికారులు దృష్టిపెట్టారు.
వారంలో నిర్ణయం..
ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ అంశంపై చర్చించడానికి సమావేశం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అదేవిధంగా షెడ్యూల్ ప్రకారమే అన్ని ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఆయా సెట్లకు సంబంధించిన కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అనంతరం ఈ కమిటీలు సమావేశమై ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేస్తాయి. అయితే దీనికి ముందే ఇంటర్ వెయిటేజీ అంశంపై విద్యార్థులకు స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నారు. వారంరోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read:
విద్యార్థులకు గుడ్ న్యూస్, ఇక ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో ఎంసెట్ కోచింగ్!
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ బోర్డు శుభవార్త తెలిపింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉచిత ఎంసెట్ కోచింగ్‌ను నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వెంటనే చేయాలని ఇంటర్ బోర్డు కమిషనర్ నవీన్ మిట్టల్ ఆయా జిల్లా అధికారులు, కాలేజీల ప్రిన్సిపాల్స్, నోడల్ అధికారులకు ఈ మేరకు ఆదేశించారు. ఉత్సాహవంతులైన విద్యార్థులను ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో గుర్తించి జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉచిత ఎంసెట్ తరగతులు నిర్వహించాలని నవీన్ మిత్తల్ అధికారులను కోరారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఫిబ్రవరిలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఏప్రిల్ మే నెలలో జరిగే 'ఇంటెన్సివ్ సమ్మర్ ఉచిత ఎంసెట్-2023 కోచింగ్'కు ఎంపిక చేయనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఇంటర్ సెకండియర్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు 19 వరకు అవకాశం! ఆలస్య రుసుముతో ఎప్పటివరకంటే?
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లించేందుకు డిసెంబరు 19 వరకు అవకాశం కల్పించినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. అయితే రూ.120 ఆలస్య రుసుముతో డిసెంబరు 26 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో జనవరి 2 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో జనవరి 9 వరకు, రూ.2,000 ఆలస్య రుసుముతో జనవరి 17 వరకు, రూ.3,000 ఆలస్య రుసుముతో జనవరి 23 వరకు, రూ.5,000 ఆలస్య రుసుముతో జనవరి 30 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంది. విద్యార్థులు పరీక్ష ఫీజు దరఖాస్తుకు రూ.10, పరీక్ష ఫీజు కింద రూ.700 చెల్లించాల్సి ఉంటుంది. రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిల్ అయినవారు, హాజరు మినహాయింపు కోరే ప్రైవేటు విద్యార్థులు, గ్రూపు మార్చుకున్నవారు ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా డిసెంబరు 19 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వెబ్‌సైట్‌లో 'క్లాట్' అడ్మిట్ కార్డులు, 17 వరకు అప్లికేషన్ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోడానికి అవకాశం!
దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి 'కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)-2023' ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 18న క్లాట్-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు డిసెంబరు 17న రాత్రి 11.59 గంటలలోపు ప్రవేశ ప్రాధాన్యాలను (అడ్మిషన్ ప్రిఫరెన్సెస్) నమోదుచేయాల్సి ఉంటుంది.
అడ్మిట్ కార్డు, అడ్మిషన్ ప్రిఫరెన్స్ కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..