తెలంగాణలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సుల్లో సీట్ల భర్తీకీ ఇప్పటికే నాలుగు విడతల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. అన్ని విడతల కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్ల భర్తీకి ఆగస్టు 17న యూనివర్సిటీ ఆడిటోరియంలో వాక్‌‌ఇన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. పాలిసెట్‌-2023లో ర్యాంకు పొందిన వారికి ఈ కౌన్సెలింగ్‌లో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆ తర్వాత పదోతరగతి పాసైన వారికి (పాలిసెట్‌ ర్యాంకు లేకున్నా) రెండో ప్రాధాన్యత ఉంటుంది.


ఆసక్తిగల అభ్యర్థులు నేరుగా వాక్‌ఇన్ కౌన్సెలింగ్‌‌కు హాజరుకావచ్చు. సీట్లు పొందిన విద్యార్థులు నిర్ణీత ఫీజు రూ. 20,000 (యూనివర్సిటీ పాలిటెక్నిక్‌లకు), రూ.22,000 (ప్రైవేటు పాలిటెక్నిక్‌లకు) చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికేట్స్‌ తీసుకొని కౌన్సెలింగ్‌‌కు హాజరుకావాలి. గతంలో దరఖాస్తు చేసినవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదు. వీరు నేరుగా కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు.


వివరాలు..


* వాక్‌‌ఇన్‌ కౌన్సెలింగ్‌ - డిప్లొమా ప్రవేశాలు 


➥ యూనివర్సిటీ పాలిటెక్నిక్స్


మొత్తం సీట్ల సంఖ్య: 308, మిగిలిన సీట్లు: 63


1) డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (రెండేళ్లు) 


మిగిలిన సీట్ల సంఖ్య: 62 (ఓసీ-41, ఈడబ్ల్యూఎస్-21).


2) డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ (మూడేళ్లు)


మిగిలిన సీట్ల సంఖ్య: 01 (ఈడబ్ల్యూఎస్-01).


➥ అఫీలియేట్ పాలిటెక్నిక్స్


మొత్తం సీట్ల సంఖ్య: 594, మిగిలిన సీట్లు: 511


3) డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (రెండేళ్లు)


మిగిలిన సీట్ల సంఖ్య: 359 (ఓసీ-320, ఈడబ్ల్యూఎస్-39).


4) డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (రెండేళ్లు)


మిగిలిన సీట్ల సంఖ్య: 58 (ఓసీ-52, ఈడబ్ల్యూఎస్-06).


5) డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ (మూడేళ్లు)


మిగిలిన సీట్ల సంఖ్య: 94 (ఓసీ-85, ఈడబ్ల్యూఎస్-09).


అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు పాలిటెక్నిక్ అర్హత ఉండాలి. పాలిటెక్నిక్ అర్హతకానివారు కూడా కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు. 


వయోపరిమితి: 31.12.2023 నాటికి 15 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: రూ.1200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.


కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సినవారు తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు..



  • పదోతరగతి మార్కుల మెమో సర్టిఫికేట్

  • టీఎస్ పాలిసెట్ 2023 ర్యాంకు కార్డు

  • 4-10వ తరగతి సర్టిఫికేట్లు/బోనఫైడ్

  • నాన్-మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ (అవసరమైనవారికి)

  • క్యాస్ట్ సర్టిఫికేట్ (బీసీ, ఎస్సీ, ఎస్టీ)

  • ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ (2023-24) 

  • పీహెచ్‌ సర్టిఫికేట్ (దివ్యాంగులకు)

  • చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్‌డ్ పర్సనల్ సర్టిఫికేట్/డిఫెన్స్ పర్సనల్ సర్టిఫికేట్

  • ఎన్‌సీసీ సర్టిఫికేట్

  • స్పోర్ట్స్ & గేమ్స్ సర్టిఫికేట్


కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


టీఎస్ ఐసెట్‌-2023 కౌన్సెలింగ్‌ వాయిదా, కొత్త షెడ్యూలు ఇదే!
తెలంగాణలో ఆగస్టు 14 నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదాపడింది. కొత్తగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 6, 7 తేదీల్లో రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. తదనంతరం సెప్టెంబరు 8 నుంచి 13 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. వెబ్ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు ఎంసీఏ, ఎంబీఏ తొలివిడత సీట్లను సెప్టెంబర్‌ 17న కేటాయించనున్నారు. సెప్టెంబరు 22 నుంచి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తాంచనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..