Vignan University Admission 2024: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం వీశాట్-2024 (Vignan Scholastic Aptitude Test) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరంలలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలుకల్పించనున్నారు. నోటిఫికేషన్‌ను ఉపకులపతి పి.నాగభూషణ్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్ అడ్మిషన్స్ కేవీ క్రిష్ణకిషోర్, డైరెక్టర్ గౌరీశంకరరావు నవంబరు 22న విడుదల చేశారు.
ప్రవేశాలు కోరువారు ఆయా క్యాంపస్‌ల్లో దరఖాస్తులు పొందవచ్చు. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. భారతీయ విద్యార్థులతో పాటు, విదేశాల్లో ఉంటున్న భారత సంతతి విద్యార్థులు కూడా ప్రవేశాలకు అర్హులు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వీశాట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. విశాట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అదేవిధంగా ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్స్ అందిస్తారు.
వివరాలు..
* వీశాట్-2024 (విజ్ఞాన్ స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్)
యూజీ కోర్సులు
➥ బీటెక్
➥ బీఫార్మసీ
➥ బీబీఏ
➥ బీసీఏ
➥ బీఎస్సీ
➥ బీఏ ఎల్‌ఎల్‌బీ
➥ బీబీఏ ఎల్‌ఎల్‌బీ
➥ బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్
పీజీ కోర్సులు..
➥ ఎంటెక్
స్పెషలైజేషన్లు: ఎంబెడెడ్ సిస్టమ్స్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, సీఎస్‌ఈ, పవర్ ఎలక్ట్రానిక్స్ & డ్రైవర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, మెషిన్ డిజైన్, బయోటెక్నాలజీ, ఫార్మ్ మెషినరీ, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్.
➥ ఎంబీఏ
స్పెషలైజేషన్లు: మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్, ఆపరేషన్స్.
➥ ఎంసీఏ
➥ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ
➥ ఎంఏ ఇంగ్లిష్
పీహెడీ ప్రవేశాలు
అర్హత: యూజీ ప్రవేశాలకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, పీజీ ప్రవేశాలకు సంబంధిత డిగ్రీ అర్హత ఉండాలి. పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1200.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: వీశాట్ ప్రవేశ పరీక్ష, ఎంసెట్, జేఈఈ మెయిన్స్/అడ్వాన్స్‌డ్, ఇంటర్ మార్కుల ఆధారంగా.
దరఖాస్తుకు చివరితేది: 25.02.2024.
ALSO READ:
నిట్ వరంగల్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డిసెంబర్-2023 సెషన్‌కు సంబంధించి పీహెచ్‌డీ (PhD) ఫుల్‌టైమ్/పార్ట్‌టైమ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఇంజినీరింగ్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్, కెమికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) విభాగాలతోపాటు బయోటెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించనున్నారు.
ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..
ఓయూ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ 'లేటరల్ ఎంట్రీ' ప్రవేశాలు..
డిప్లొమా అర్హత ఉండి, ఉద్యోగాలు చేస్తూ.. ఇంజినీరింగ్ చదవాలనుకునే వారికోసం 'బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్' పేరుతో బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణలోని 12 ఇంజినీరింగ్ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇటీవలే అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.