సరోజినీ దామోదర్ ఫౌండేషన్ ‘విద్యాధన్ స్కాలర్‌షిప్ ప్రోగామ్’ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాధాన్ స్కాలర్‌షిప్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల విద్య అభ్యసించడానికి స్కాలర్‌షిప్ అందజేస్తుంది. కచ్చితమైన ఎంపిక ప్రక్రియ ద్వారా పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్న విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ అందజేస్తుంది. ఇప్పటివరకు ఈ ప్రోగ్రామ్ ద్వారా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, గోవా రాష్ట్రాల నుంచి 5090 మంది విద్యార్థులు లబ్ధి పొందారు.
తెలంగాణలో 2016 విద్యా సంవత్సరం నుంచి విద్యాధాన్ ప్రోగ్రామ్ కొనసాగుతోంది. ఎంపికైనా విద్యార్థులకు రెండేళ్లపాటు ఫౌండేషన్ నుంచి స్కాలర్‌షిప్ అందుతుంది. విద్యార్థి యొక్క ప్రతిభ ఆధారంగా విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో డిగ్రీ చదువుటకు స్కాలర్‌షిప్ ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ విద్యార్ధులకు ఫౌండేషన్ ద్వారా (లేదా) ఫౌండేషన్‌లో నమోదైర దాతల ద్వారా అందజేయబడుతుంది.
విద్యార్థి చదువుతున్న కోర్సు, కాలపరిమితి ప్రకారం సంవత్సరాలనికి రూ.10,000 నుంచి రూ.60,000 వరకు స్కాలర్‌షిప్ అందజేయడం జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు ప్రోగ్రామ్ ద్వారా భవిష్యత్తుకు అవసరమైన దిశా నిర్దేశం చేయడం జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్ చదువుతున్న పేద విద్యార్థులకు విద్యాదాన్ పేరిట సరోజిని దామోదరన్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు అందజేయనుంది. ఆసక్తి ఉన్నవారు జులై 31లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఏవైనా సందేహాలుంటే ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. 6300391827 వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.
Email: vidyadhan.telangana@sdfoundationindia.com
* తెలంగాణ విద్యాధన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్
అర్హత: పదోతరగతిలో 90 శాతం మార్కులు లేదా 9 సీజీపీఏ స్కోరుతో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులకు 75 శాతం మార్కులు లేదా 9.5 సీజీపీఏ స్కోరు సరిపోతుంది. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అకడమిక్ ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఎంపికచేసిన విద్యార్థులకు మాత్రమే ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. పరీక్ష కేంద్రాల సమాచారాన్ని ఈమెయిల్/ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు.
స్కాలర్‌షిప్: ఎంపికైనవారికి ఏడాదికి రూ.10,000 స్కాలర్‌షిప్ అందుతుంది. మెరిట్ స్కోరుతో కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఉన్నత చదువుల(డిగ్రీ-తత్సమాన) కోసం ఏడాదికి రూ.10,000 – రూ.60,000 ఉపకారం అందుతుంది.
దరఖాస్తుకు జతచేయాల్సిన డాక్యుమెంట్లు:
- 10వ తరగతి మార్క్స్ షీట్ (ఒరిజినల్ మార్కుల షీట్ లేకపోతే ఎస్‌ఎస్‌సీ బోర్డు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నదైనా సరిపోతుంది)
- తాజా పాస్‌పోర్ట్ సైట్ ఫోటో
- ఇన్‌కమ్ సర్టిఫికెట్
- దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం (దివ్యాంగులు అయితే)
ముఖ్యమైన తేదీలు:
* దరఖాస్తుకు చివరితేది: 31-07-2022
* రాతపరీక్ష,ఇంటర్వ్యూ తేది: 14-08-2022