నచ్చిన కాంటెంట్ అరచేతుల్లో అందుబాటులో ఉండే ఈ కాలంలో, ఎంటర్టైన్మెంట్ కోరుకునేవాళ్లకు ఓటీటీ లు ఒక వరం. నచ్చిన జానర్‌లోనో, నచ్చే డైరెక్టర్, లేదా యాక్టర్‌ నటించిన సీరీస్ వచ్చిందంటే రోజుకో ఎపిసోడ్ మాత్రమే చూసేవాళ్లు ఇపుడు లేరు. రాత్రైనా, పగలైనా సీరీస్ అయిపొయే వరకు చూడాల్సిందే. ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరికీ అవసరమే. కానీ, ఒళ్లు తెలియకుండా, కూర్చొని చూస్తూ, మరుసటి రోజు "టైం అంతా ఓటీటీలకే పోతోంది. నాకు తెలియకుండానే అలాగడిపేస్తున్నా. ఇదొక అడిక్షన్ లా మారింది" అని బాధపడేవాళ్లు కూాడ ఉంటారు. ఓటీటీలు బోర్ కొట్టేశాయనో  లేదా చూడాల్సిన ఇంట్రెస్టింగ్ కంటెంట్‌ లేదనో ఫీల్‌ అయ్యే వాళ్ల మనసు గాలి మళ్లించి ఇంకో ప్లాట్‌ఫామ్‌ ఉండనే ఉంది. అవే టెడ్‌ టాక్‌లు. ఇవి కాస్త ఉపశమనంతోపాటు జీవితానికి అవసరమయ్యే బోలెడంత కంటెంట్‌ను ప్రొవైడ్ చేస్తాయి. 


1. "ద పవర్ ఆఫ్ వల్నరబిలిటీ" (The Power Of Vulnerability) బై బ్రీన్ బ్రౌన్(Breen Brown)


ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ మందికి రీచ్ అయిన టెడ్ టాక్ లలో "ద పవర్ ఆఫ్ వల్నరబిలిటీ(The power of vulnerability)" ఒకటి. మానసిక అనారోగ్యం మానవ సంబంధాలలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది. తొందరగా మనసు గాయపడే ఈ తత్వాన్ని, మనలో లోపాలను ప్రేమించుకుంటూ, మన వ్యక్తిత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలో బ్రీన్ బ్రౌన్(Brene Brown) గొప్పగా వివరించారు. 


2. "ద ఆర్ట్ ఆఫ్ స్టిల్ నెస్" (The Art Of Stillness)బై పికో అయ్యర్(Pico ayyar)


ఉరుకులు పరుగుల జీవితంలో, కాస్త ఆగి, స్థిరంగా ఉండటం, ఒంటరిగా ప్రశాంతంగా కాసేపు గడపటం మనిషి ఆరోగ్యానికి, ఉన్నతమైన జీవన విధానాన్ని అవలభించటానికి ఎంత అవసరమో ఈ టెడ్ టాక్ గుర్తుచేస్తుంది.


3. "హౌ గ్రేట్ లీడర్స్ ఇన్స్పైర్ యాక్షన్"(How Great Leaders Inspire Action) బై సైమన్ సినెక్(Simon Sinek)


ఆదర్శవంతమైన లీడర్షిప్ లక్షణాలను చెప్తూ, తన గోల్డెన్ సర్కిల్ అనే కాన్సెప్ట‌్‌ను సైమన్ సినెక్ పరిచయం చేస్తారు. కమ్యూనికేషన్ రంగంలో ఎదగాలనుకునే వారికి, లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి టెడ్ టాక్.


4. "యువర్ బాడీ లాంగ్వేజ్ మే షేప్ హూ యూ ఆర్" (Your body language may shape you who you are)బై ఏమీ కడ్డీ (Amy cuddy)


మన బాడీ లాంగ్వెజ్, సెల్ఫ్ కాంఫిడెన్స్ కు ఎంతో సంబంధం ఉంటుంది. మనం కాంఫిడెంట్ గా ఉన్నామో లేదో, మన చేష్టలు, ముఖకవలికలు, చేతులు, కాళ్లు కదిలించే పద్ధతి ద్వారా అవతలి వారికి అర్థమయిపోతుంది. ఎలాంటి జెస్చర్స్ వల్ల మనం అనేక సందర్భాల్లో కాంఫిడెంట్ గా కనపడొచ్చో తన రీసర్చ్ ద్వారా కనుగొన్న పద్ధతులను ఏమీ కడ్డీ(Amy Cuddy) వివరించారు.


5."ద సర్ప్రైజింగ్ సైన్స్ ఆఫ్ హ్యపీనెస్" (The surprising science of happiness)బై డాన్ గిల్బెర్ట్ (Don Gilbert)


మనకు దేని వల్ల సంతోషం వస్తుంది? ఏది ఉంటే సంతోషంగా ఉంటాము అని మనం అపోహ పడుతాము? అనే విషయాల మీద హార్వర్డ్ కు చెందిన సైకాలజిస్ట్ డాన్ గిల్బర్ట్ మాట్లాడుతారు. హ్యాపీనెస్ కు సంబంధించి సైన్స్ ఏమంటుందో ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ఇది జీవితంలో మరింత ఆనందాన్ని వెతుక్కొని ముందుకు వెళ్లటానికి ఉపయోగపడుతుంది.


6. "ద పవర్ ఆఫ్ బిలీవింగ్ థట్ యూ కెన్ ఇంప్రూవ్" (The power of believing that you can improve)బై కరోల్ డ్వెక్ (carol dweck)


జీవితంలో ఎంతో నేర్చుకొని, ఉన్నతంగా ఎదగాలనుకునే వారికి, ముఖ్యంగా విద్యార్థులకు, ఎడ్యుకేటర్స్ కు ఈ టెడ్ టాక్ మార్గనిర్దేశ్యం చేస్తుంది. 


ఇవే కాకుండా, జీవితంలో స్ఫూర్తిని కలిగించి, ఉన్నతంగా తీర్చిదిద్దగలిగే టాక్స్ కొన్ని వేలల్లో యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. మన అవసరాన్ని బట్టి, మన లక్ష్యాలను బట్టి అపుడపుడూ సరైన్ విడియోలు ఎంచుకొని చూస్తే జీవితంలో ఎంతో ఉపయోగపడొచ్చు.