Balakrishna Viral Video: విద్యార్థులకు పాఠాలు చెప్పడంలో ఒక్కో టీచర్‌ది ఒక్కో శైలి ఉంటుంది. అయితే కొందరు టీచర్లు మాత్రం ఇంకాస్త డిఫరెంట్‌గా పాఠాలు బోధిస్తుంటారు. ఓ టీచర్ ఇలాగే పిల్లలకు పాఠాలు చెబుతోంది. ఏకంగా హీరో బాలకృష్ణ పాటను తన పాఠానికి ప్రేరణగా తీసుకొంది. అఖండ సినిమాలోని జై బాలయ్య పాటలోని బాలకృష్ణ వేసే స్పెప్పులను ఉదహరిస్తూ.. ఫిజిక్స్ ఫార్ములాను వివరించింది. దీని ద్వారా 'Body Moving with Constant Velocity with Variable Mass' ఫార్ములాను సులభంగా వివరించే ప్రయత్నం చేసింది. 


టీచర్ చెప్పిన ఫిజిక్స్ పాఠంలోని అంశం ఇదే..
పాఠలో బాలయ్య వేసుకున్న షర్టులు ఒకదాని తర్వాత ఒకటి వెళిపోతుంటే.. బాలయ్య బాబు Mass తగ్గిపోతుంది. Constant Velocity తో స్టెప్ వేసుకుంటూ వెళుతూనే ఉన్నాడు. ఇక్కడ Body Moving with Constant Velocity with Variable Mass ఫార్ములా F = V (dm/dt).


అయితే బాలయ్య అభిమానులు ఈ వైరల్ వీడియో చూసి ఖుషీ అవుతున్నారు. బాలయ్య సినిమాలపై ప్రత్యర్థులు చేస్తున్న కామెంట్స్‌కు ఇది గుణపాఠమంటున్నారు అభిమానులు.  ఫైట్స్‌లో ఫిజిక్స్ లేదని చెప్పే వాళ్లకి అదే ఫిజిక్స్ క్లాసుల్లో తన స్టెప్ రెఫరెన్స్ పెట్టుకునేలా చేశారని కామెంట్లు చేస్తున్నారు.