UGC NET 2022: యూజీసీ నెట్ 2022 ఫేజ్-2 పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సెప్టెంబర్ 17న విడుదల చేసింది. అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేది వివరాలు నమోదుచేసి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 20  నుంచి 22 వరకు ఫేజ్-2 పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 64 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎగ్జామ్ ఇంటిమేషన్ స్లిప్స్ అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.  


Download Admit Card for UGC-NET Dec. 2021 and June 2022 (merged cycles)



వాస్తవానికి ఆగస్టు 12, 14 వరకు జరగాల్సిన పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాయిదావేసిన సంగతి తెలిసిందే. వాయిదాపడిన పరీక్షలను సెప్టెంబరు 20 నుంచి 30 వరకు నిర్వహించనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీనెట్ డిసెంబరు 2021, జూన్-2022 (మర్జ్‌డ్ సైకిల్) ఫేజ్-1 పరీక్షలను జులై 9, 11, 12 తేదీల్లో నిర్వహించింది. 33 సబ్జెక్టులకుగాను దేశంలోని 225 నగరాల్లో 310 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించింది.

Also Read: SSC: 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2022' నోటిఫికేషన్‌ వచ్చేసింది, 20 వేల ఉద్యోగాల భర్తీ!

UGC NET 2022 ఫేజ్-2 అడ్మిట్ కార్డు ఇలా డౌన్‌లోడ్ ఇలా..


Step 1: అడ్మిట్ కార్డు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. -ugcnet.nta.nic.in.


Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'UGC NET Admit card 2022' లింక్ మీద క్లిక్ చేయాలి.


Step 3: అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి లాగిన్ అవ్వాలి.


Step 4: కంప్యూటర్ స్క్రీన్ మీద అడ్మిట్ కార్డు దర్శనమిస్తుంది.


Step 5: అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకొని, భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసి భద్రపర్చుకోవాలి.

Read Also:  ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా



ఫేజ్
-3 పరీక్ష షెడ్యూలు వెల్లడి...
యూజీసీ నెట్ ఫేజ్-3 పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 14 వరకు నిర్వహించనున్నారు . సెప్టెంబరు 23, 29, 30 తేదీల్లో; అక్టోబరు 1, 8, 10, 11, 12, 13, 14 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్ సిటీ స్లిప్స్‌ను పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల సమయంలో అందుబాటులో ఉంచుతారు. ఏమైనా సందేహాలుంటే అభ్యర్థులు ఫోన్ నెంబరు 01140759000 (లేదా) ఈమెయిల్: email at ugcnet@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.

Subject-wise schedule of examination of Phase III


డిసెంబర్‌–2021, జూన్‌–2022 సంయుక్తంగా:
వాస్తవానికి ఏటా రెండుసార్లు డిసెంబర్, జూన్‌ నెలల్లో యూజీసీ–నెట్‌ నిర్వహిస్తారు. గత ఏడాది కోవిడ్‌ పరిస్థితుల కారణంగా డిసెంబర్‌–2021 సెషన్‌ నిర్వహించడానికి వీలు పడలేదు. దీంతో డిసెంబర్‌–2021, జూన్‌–2022లను కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఫేజ్-1 పరీక్షను జులైలో నిర్వహించగా, సెప్టెంబరు 20 నుంచి ఫేజ్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.. యూజీసీనెట్ పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే..


యూజీసీ నెట్‌ను మొత్తం 300 మార్కులకు రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ & అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధిస్తారు.


Read Also:  ఎఫ్‌సీఐ 5043 ఉద్యోగాల భర్తీ - దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఇదే!



రెండు పేపర్లుగా పరీక్ష
:
యూజీసీ నెట్‌ పరీక్ష.. రెండు పేపర్లుగా ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా నిర్వహించనున్నారు.


పేపర్‌–1: అసిస్టెంట్‌ ప్రొఫెసర్, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ అండ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పరీక్షకు అభ్యర్థులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి.


పేపర్‌–2: ఇది అభ్యర్థుల పీజీ స్పెషలైజేషన్‌ ఆధారంగా యూజీసీ నెట్‌లో పేర్కొన్న సబ్జెక్ట్‌కు సంబంధించిన పరీక్ష


కనీస అర్హత మార్కులు:
యూజీసీ నెట్‌లో(జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌) ఉత్తీర్ణత సాధించాలంటే.. అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధించాలి. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లలో కలిపి కనీసం 40 శాతం మార్కులు, రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. ఈ సడలింపు(35 శాతం మార్కులు) జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు కూడా ఉంటుందని పేర్కొన్నారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...