యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్​ రీసెర్చ్​ ఫెలోల ఎలిజిబులిటీ కోసం ఏటా రెండు సార్లు నిర్వహించే యూజీసీ నేషనల్‌ ఎలిజిబుల్‌ టెస్టు (UGC NET) పరీక్ష దరఖాస్తు గడువు ఈ రోజుతో (సెప్టెంబర్ 5)  ముగియనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యూజీసీ నెట్ పరీక్షలను నిర్వహిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ రోజు రాత్రి 11.50 లోగా ugcnet.nta.nic.in లేదా nta.ac.in వెబ్ సైట్ల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజులను రేపు (సెప్టెంబర్ 6) ఉదయం 11.50 వరకు చెల్లించవచ్చు. 


రిజిస్టర్ చేసుకోండిలా..



  1. ugcnet.nta.nic.in వెబ్ సైట్ ఓపెన్ చేయండి. 

  2. హోం పేజీలో “అప్లికేషన్ ఫామ్ యూజీసీ నెట్ డిసెంబర్ 2020 అండ్ జూన్ 2021 సైకిల్“ లింక్ పై క్లిక్ చేయండి. 

  3. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అందులో పేర్కొన్న వివరాలతో రిజిస్టర్ అవ్వండి. 

  4. నోటిఫికేషన్‌లో పేర్కొన్న డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి. ఇక్కడితో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. 

  5. రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తి అయ్యాక.. ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన తర్వాత పూర్తి అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దీనిని భవిష్యత్ అవసరాల కోసం డౌన్ లోడ్ చేసుకోండి. 

  6. దరఖాస్తు డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


యూజీసీ నెట్ ఎగ్జామ్ తేదీలు మారాయి..
యూజీసీ నేషనల్‌ ఎలిజిబుల్‌ టెస్టు (నెట్) పరీక్ష తేదీలు మారాయి. యూజీసీ నెట్ 2021 పరీక్షలు అక్టోబర్‌ 6 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్లు గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌లో ఉంది. అయితే ఈ తేదీల్లో ఇతర ముఖ్యమైన పరీక్షలు ఉండటంతో.. పరీక్ష తేదీలను సవరించాలని ఎన్టీఏ నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన పరీక్ష తేదీలను విడుదల చేసింది.


ఈసారి యూజీసీ నెట్ 2021 పరీక్షలను 2 బ్లాకులుగా నిర్వహించనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. మొదటి బ్లాక్ పరీక్షలు అక్టోబర్ 6 నుంచి 8 వరకు నిర్వహిస్తమని చెప్పింది. ఇక రెండో బ్లాక్ పరీక్షలు అక్టోబర్ 17 నుంచి 19 వరకు జరగనున్నట్లు తెలిపింది. పరీక్షల షెడ్యూల్ సహా పూర్తి వివరాల కోసం పైన పేర్కొన్న యూజీసీ నెట్ వెబ్‌సైట్లను సంప్రదించవచ్చు.


Also Read: Bigg Boss 5 Telugu Contestants: ‘బిగ్ బాస్ 5’ అప్‌డేట్స్: కంటెస్టెంట్స్ జాబితా లీక్.. సిరి డ్యాన్స్‌తో షో ఆరంభం? విన్నర్ అతడేనట!


Also Read: Huzurabad News: కేసీఆర్‌కు ఆ ప్రాజెక్టు ATM లాంటిది.. ఆయన ఇంట్లోనే వ్యతిరేకులు, త్వరలోనే.. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు