నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే నేషనల్‌ ఎలిజిబుల్‌ టెస్టు నోటిఫికేషన్‌ విడుదలైంది. యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్ ఆధ్వర్యంలో NTA నిర్వహించే ఈ పరీక్షను అక్టోబర్‌లో నిర్వహిస్తారు. అక్టోబర్‌ 6 నుంచి 11 వరకు పరీక్షలు జరగనున్నాయి.

ugcnet.nta.nic.in వెబ్‌సైట్‌లో అభ్యర్థులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబరు 5 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. వచ్చే నెల ఐదు సాయంత్రం వరకు ఫీజు చెల్లించవచ్చు.  అప్లికేషన్ నింపవచ్చు. ఆ తర్వాత అంటే సెప్టెంబర్‌ ఏడు నుంచి పన్నెండో తేదీ వరకు అప్లికేషన్లు కరెక్షన్ చేసుకోవచ్చు. 

 

యూజీసీ నెట్‌ ఈవెంట్‌

తేదీ

నెట్‌- 2021 నోటిఫికేషన్ విడుదల 2 ఫిబ్రవరి 2021 
అప్లికేషన్ స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల 10  ఆగస్టు 2021 
అప్లికేషన్ స్వీకరణకు ఆఖరు తేదీ 5 సెప్టెంబర్‌, 2021
అప్లికేషన్‌లో తప్పులు సరిదిద్దుకునే తేదీ 6 సెప్టెంబర్‌ నుంచి 12 సెప్టెంబర్‌ 2021
హాల్‌ టికెట్లు డౌన్‌లోడు తేదీ  ప్రకటించాల్సి ఉంది
నెట్‌-2021 తేదీలు 6 అక్టోబర్‌ నుంచి 11 అక్టోబర్‌


కరోనా కారణంగా డిసెంబరు 2020లో  నిర్వహించాల్సిన నెట్ పరీక్ష వాయిదా పడడంతో... జూన్ 2021 యూజీసీ నెట్ షెడ్యూల్ కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), UGC సమ్మతితో... డిసెంబర్ 2020-జూన్ 2021 UGC-NET రెండింటినీ విలీనం చేసింది.  ఇప్పుడు CBT (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు.  ఈ మేరకు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికోసం అప్లికేషన్ ప్రక్రియను పునరుద్ధరించింది.  ఈ మేరకు కొత్త తేదీలను NTA తన వెబ్‌సైట్‌లో విడుదల చేసిన నోటీసులో పేర్కొంది. 

డిసెంబర్ 2020-జూన్ 2021 రెండింటికి సంబంధించి JRF స్లాట్‌లను విలీనం చేశారు. అయితే వర్గాల వారీగా JRF ల కేటాయింపు పద్దతిలో ఎలాంటి మార్పు ఉండవని స్పష్టం చేశారు.  ఇంతకుముందు 2021 మే 2 నుంచి 17 వరకు పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఆ తేదీలను ఇప్పుడు అక్టోబరు  6 నుంచి 11 వరకూ మార్చింది. ఏమైనా మార్పులుంటే త్వరలోనే అభ్యర్థులకు తెలియజేస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది....

హాల్‌టికెట్లు ఎప్పటి నుంచి డౌన్ లౌడ్ చేసుకోవచ్చో తర్వాత తెలియజేయనున్నారు. దేశవ్యాప్తంగా యూనివర్శిటీల్లో, కాలేజీల్లో పని చేయాలంటే ఈ నెట్‌ క్లియర్ చేయాలి. ఇలా క్లియర్ చేసిన వాళ్లను అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ కూడా పొందవచ్చు.