ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిల చదువు కోసం మేమున్నామంటూ ముందుకొస్తుంది ‘యూగో (U-Go)’ అనే స్వచ్ఛంద సంస్థ. స్కాలర్‌షిప్ ప్రోగ్రామింగ్ ద్వారా చేయూత అందిస్తోంది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి ‘గివ్‌ఇండియా’తో కలిసి ఉపకారవేతనాల కోసం దరఖాస్తులు కోరుతోంది. కాలిఫోర్నియాకు చెందిన ‘యూగో’ అనేది స్వచ్ఛంద సంస్థ. ఏడు దేశాల్లోని ఆర్థికంగా వెనకబడిన అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో మన దేశంలోని అమ్మాయిలకు స్కాలర్‌షిప్‌లు అందివ్వడానికి తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 30 చివరి తేదీగా నిర్ణయించారు.


వివరాలు..

* యూగో స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్

ఎవరు అర్హులు?
దేశంలోని అమ్మాయిలందరూ ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. టీచింగ్‌, నర్సింగ్‌, ఫార్మసీ, మెడిసిన్‌, ఇంజినీరింగ్‌.. వంటి ప్రొఫెషనల్‌ డిగ్రీ చదివే అమ్మాయిలు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ​​​​​​ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెగ్యులర్‌ డిగ్రీ కోర్సులో నమోదు చేసుకుని ఉండాలి. పదోతరగతి, ఇంటర్‌లో 70 శాతం మార్కులు వచ్చి ఉండాలి. పదోతరగతి, ఇంటర్‌లో 70 శాతం మార్కులు వచ్చి ఉండాలి. కుటంబ వార్షిక ఆదాయం 5 లక్షలకు మించకూడదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 


ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, కుటుంబ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఎంపికచేస్తారు.

స్కాలర్‌షిప్ ప్రయోజనాలివే..


🔰 ​​​​​​​ టీచింగ్‌ కోర్సు చదివే అమ్మాయిలకు సంవత్సరానికి 40 వేల రూపాయల చొప్పున రెండు సంవత్సరాల పాటు అందిస్తారు.


🔰 నర్సింగ్‌, ఫార్మసీ కోర్సులు చదివే విద్యార్థినులకు సంవత్సరానికి 40 వేల రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు అందిస్తారు.


🔰​​​​​​​ ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ చదివే అమ్మాయిలకు సంవత్సరానికి 60 వేల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు అందిస్తారు.

దరఖాస్తు సమయంలో అవసమరమయ్యే డాక్యుమెంట్లు...


🔰 ఇంటర్ మెమో

🔰 విద్యార్థులు ఐడీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు/ ఓటర్ ఐడీ కార్డు/ డ్రైవింగ్ లైసెన్స్/ పాన్ కార్డు ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. 


🔰 దీనికి సంబంధించిన ఫీజు చెల్లించిన రశీదు, అడ్మిషన్ లెటర్‌, ఐడీ కార్డు, బోనఫైడ్‌ సర్టిఫికెట్‌‌ను జతచేయాల్సి ఉంటుంది. 


🔰 కుటుంబ ఇన్‌కమ్ ప్రూఫ్ (ఐటీఆర్-16/ఇన్‌కమ్ సర్టిఫికేట్/సాలరీ స్లిప్స్) 


🔰 అభ్యర్థుల బ్యాంక్ అకౌంట్ వివరాలు


🔰 ఫొటోగ్రాఫ్


దరఖాస్తు ఇలా..


🔰 స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మొదట వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.


🔰 అప్లికేషన్ ఫామ్‌లో అభ్యర్థులు తమ Buddy4Study  రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలతో లాగిన్ కావచ్చు. రిజిస్ట్రేషన్ లేనివారు ఈమెయిల్/మొబైల్ నెంబర్/జీమెయిల్ అకౌంట్ వివరాలతో లాగిన్ కావచ్చు.


🔰 ‘U-Go Scholarship Program’ స్కాలర్‌షిప్ పేజీలోకి వెళ్లాలి. 


🔰 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించడానికి ‘Start Application’ బటన్ మీద క్లిక్ చేయాలి. 


🔰 అవసమరమైన వివరాలతో దరఖాస్తుపత్రంలో వివరాలు నమోదుచేయాలి. 


🔰 అవసరమైన అన్ని డాక్యుమెంట్లు నమోదుచేయాలి.


🔰‘Terms and Conditions’ను అంగీకరిస్తున్నట్లు తెలపాలి. తర్వాత ‘Preview’ క్లిక్ చేయాలి.


🔰 అభ్యర్థి తన వివరాలన్నీ కరెక్టుగా నింపినట్లయితే కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. 


🔰 చివరగా ‘Submit’ బటన్ మీద క్లిక్ చేసి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. 


Notification & Online Application