APTWREIS: ఆంధ్రప్రదేశ్‌లోని 31 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగాను 5వ తరగతి రెగ్యులర్ ప్రవేశాలతో పాటు 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన బాలబాలికలు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు స్టేట్ సిలబస్, ఆంగ్ల మాధ్యమ ఉచిత విద్య, వసతితో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది.
వివరాలు..
➥ 5వ తరగతి ప్రవేశాలు
➥ 6, 7, 8, 9 తరగతుల్లో రెగ్యులర్ బ్యాక్‌లాగ్ సీట్లలో ప్రవేశాలు
సీట్ల సంఖ్య: 5వ తరగతిలో 2480 సీట్లు; 6వ తరగతిలో 481 సీట్లు; 7వ తరగతిలో 174 సీట్లు; 8వ తరగతిలో 111 సీట్లు; 9వ తరగతిలో 188 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: తరగతిని అనుసరించి నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం చదివి ఉండాలి. 5వ తరగతి ప్రవేశాలకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. అదేవిధంగా 6, 7, 8, 9వ తరగతులకు సంబంధించి రెగ్యులర్ బ్యాక్‌లాగ్ సీట్లలో ప్రవేశాలకు ఎస్టీ విద్యార్థులు మాత్రమే దరఖాస్తుకు అవకాశం ఉంటుంది.
ఆదాయపరిమితి: విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా, చిత్తూరు, కడప, అనంతపురం
ముఖ్యమైన తేదీలు...
➥ ప్రవేశ ప్రకటన: 15.02.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.04.2024.
➥ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 11.04.2024 నుంచి.
➥ ప్రవేశ పరీక్షతేది: 21.04.2024.
పరీక్ష సమయం: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.
➥ మెరిట్ జాబితా వెల్లడి: 10.05.2024.
➥ పరీక్ష కేంద్రాల్లో ఎంపిక జాబితాలు: 20.05.2024.
➥ ఎంపికైన విద్యార్థుకలు సమాచారం: 22.05.2024.
➥ తరగతులు ప్రారంభం: అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.
ALSO READ:
MJPAPBC Admissions: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్
విజయవాడలోని మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే 103 బీసీ బాలికల పాఠశాలలు, 14 బీసీ జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి(ఇంగ్లిష్ మీడియం), ఇంటర్మీడియట్(ఇంగ్లిష్ మీడియం) మొదటిసంవత్సరంలో ప్రవేశాలకు ఫిబ్రవరి 15న నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు మార్చి 1 నుంచి 31 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 5వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ ప్రవేశాలకు ఏప్రిల్ 13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/మత్స్యకార) ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
ప్రవేశ పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..