TSWRAFPDCW Admissions: యాదాద్రి భువనగిరి జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక మహిళా డిగ్రీ కళాశాల(ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్)లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ మొదటి సంవత్సరం, ఇంటిగ్రేటెడ్ ఎంఏ(ఎకనామిక్స్) ఇంగ్లిష్ మీడియం కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రెన్స్ ఎగ్జామ్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లు, సైకో అనలిటికల్ టెస్ట్‌లు, మెడికల్ టెస్ట్‌లు, షార్ట్ లెక్చర్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వివరాలు..
➥ యూజీ కోర్సులు
సీట్ల సంఖ్య: 240 (ఒక్కో కోర్సుకు 40 సీట్లు)
➛ బీఎస్సీ- ఎంపీసీ
➛ ఎంఎస్‌సీఎస్
➛ బీజెడ్‌సీ
➛ ఎంజెడ్‌సీ
➛ బీకాం కంప్యూటర్స్
➛ బీఏహెచ్‌ఈపీ
➥ ఇంటిగ్రేటెడ్ ఎంఏ (ఎకనామిక్స్) కోర్సు
సీట్ల సంఖ్య: 40.
కోర్సుల వివరాలు: ఇంగ్లిష్ మీడియంలో కోర్సులను నిర్వహిస్తారు. దీంతోపాటు మిలిటరీ ఎడ్యుకేషన్ అంశాలు కూడా బోధిస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో ఆఫీసర్ల నియామకానికి ఉద్దేశించిన యూపీఎస్సీ ఎగ్జామ్‌లకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ ప్రోగ్రామ్‌నకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ గుర్తింపు ఉంది.
అర్హత: 2023-24లో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన బాలికలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తెలుగు మీడియంలో చదివినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లిష్ మీడియంలో చదివినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
ఇతర అర్హతలు: అభ్యర్థుల ఎత్తు కనీసం 152 సెం.మీ ఉండాలి. కుటుంబ వార్షికాదాయం నగరాల్లో రూ.2 లక్షలు; గ్రామీణ ప్రాంతవాసులైతే రూ.1.50 లక్షలలోపు ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి 16-18 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.07.2006 - 01.07.2008 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఆన్‌లైన్ విధానంలోనే ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష, ఫిజికల్ టెస్ట్, సైకో అనలిటికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
పరీక్ష విధానం:
➥ మొత్తం 250 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో స్టేజ్-1 కు 100 మార్కులు, స్టేజ్-2 కు 150 మార్కులు కేటాయించారు.
➥ మొత్తం 100 మార్కులకు స్టేజ్-1 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 3 గంటలు. ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్ స్థాయిలోనే ప్రశ్నలు అడుగుతారు.
➥ స్టేజ్-2లో భాగంగా అభ్యర్థులకు మొత్తం 150 మార్కులకు పరీక్షలు ఉంటాయి. ఇందులో ఆర్మ్‌డ్ ఫోర్సె్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్-100 మార్కులు, ఫిజికల్ టెస్ట్-10 మార్కులు, సైకో అనలిటికల్ టెస్ట్-20 మార్కులు, లిటరేచర్-10 మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ-10 మార్కులకు ఉంటుంది. ఇక కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్, మెడికల్ ఫిట్‌నెస్ టెస్టులు కూడా నిర్వహిస్తారు.
➥ ఫిజికల్ టెస్ట్: ఫిజికల్ టెస్టులో భాగంగా 100 మీటర్ల స్ర్పింట్, 400 మీటర్ల పరుగు, సిటప్స్, షటిల్ రేస్, అబ్‌స్టాకిల్ టెస్టులు నిర్వహిస్తారు. వీటికి 20 మార్కులు కేటాయించారు.
➥సైకో అనలిటికల్ టెస్ట్‌లు: ఇందులో థీమాటిక్ అప్రిసియేషన్ టెస్ట్(టీఏటీ)- ఒక బొమ్మ, వర్డ్ అసోసియేషన్ టెస్ట్(డబ్ల్యూఏటీ)- పది పదాలు, సిట్యుయేషన్ రియాక్షన్ టెస్ట్ (ఎస్‌ఆర్‌టీ)- 5 ఎస్‌ఆర్‌టీలు ఉంటాయి. వీటికి 10 మార్కులు కేటాయించారు.
➥ మెడికల్ టెస్ట్: ఇందులో నిబంధనల ప్రకారం ఎత్తు, బరువు చెక్ చేస్తారు. కళ్లు, చెవులు, పళ్లు, ఫ్లాట్ ఫూట్, నాక్ నీస్, వర్ణాంధత్వం సంబంధిత పరీక్షలు నిర్వహిస్తారు. క్రానిక్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, సర్జరీలు జరిగాయా అన్న అంశాలు చెక్ చేస్తారు. ఒక అంశం ఇచ్చి చిన్న లెక్చర్ ఇవ్వమని అడుగుతారు. దీనికి 10 మార్కులు ఉంటాయి. తరవాత పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనికి కూడా 10 మార్కులు ప్రత్యేకించారు.
ప్రవేశ సమయంలో సమర్పించాల్సిన డాక్యుమెంట్లు: పదోతరగతి మార్కుల మెమో, ఇంటర్ సర్టిఫికెట్లు; టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, ఆరోగ్రశ్రీ/ రేషన్ కార్డ్; కులం, ఆదాయం, వైకల్యం ధ్రువీకరణ పత్రాలు, అభ్యర్థి ఫొటోలు.
ముఖ్యమైన తేదీలు..
➥ ప్రవేశ ప్రకటన: 16.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.04.2024.
➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 27.10.2022.
➥ స్టేజ్-1 ప్రవేశపరీక్ష తేది: 06.05.2024.
➥ స్టేజ్-2 స్క్రీనింగ్ పరీక్ష తేది: 24.05.2024 - 01.06.2024.