TSRJC CET-2024 Halltickets: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ(TSRJC) పరిధిలోని 35 గురుకుల కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించనున్న TSRJC CET-2024 పరీక్ష హాల్‌టికెట్లను అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ Candidate Id / Reference Id, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కోసం హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో సెంటర్లను అధికారులు ఏర్పాటుచేశారు. ఏప్రిల్ 21న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఈసారి ప్రవేశ పరీక్ష కోసం 73,527 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
TS RJCCET-2024 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024–25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ మీడియం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్ఆర్జేసీ సెట్–2024 (TSRJC CET-2024) నోటిఫికేషన్‌ను జనవరి 25న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జనవరి 31 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందులో బాలురకు 15, బాలికల కోసం 20 గురుకుల జూనియర్ కాలేజీలు ఉన్నాయి. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో చేరేందుకు అర్హులు. ప్రవేశ పరీక్షలో మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. మే నెలలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
వివరాలు..
* టీఎస్ఆర్జేసీ సెట్–2024
గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ.
సీట్లసంఖ్య: 2,996.
సీట్ల కేటాయింపు: ఎంపీసీ - 1,496, బైపీసీ - 1,440, ఎంఈసీ - 60.
పరీక్ష విధానం: టీఎస్ఆర్జేసీ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మొత్తం 150 మార్కులకు సబ్జెక్టులవారీగా వేర్వేరుగా నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మల్టీపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. విద్యార్థులు ఎంచుకునే గ్రూప్ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఎంపీసీ విద్యార్థులకు ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్ నుంచి; బైపీసీ విద్యార్థులకు ఇంగ్లిష్, బయోలజికల్ సైన్స్, ఫిజిక్స్ నుంచి అదేవిధంగా ఎంఈసీ గ్రూప్‌లో చేరేవారికి ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్ సబ్జెక్టుల నుంచి పదోతరగతి స్థాయిలో ఒక్కోసబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. OMR షీటులో విద్యార్థులు జవాబులు గుర్తించాల్సి ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 31.01.2024.
* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 31.03.2024.
* TSRJC CET - 2024 ప్రవేశ పరీక్ష తేది: 21.04.2024.
* మొదటి విడత కౌన్సెలింగ్: మే 2024లో.
పరీక్ష సమయం: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.