ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ(ఆర్ఐఎంసీ)లో జనవరి- 2024 టర్మ్ ఎనిమిదోవ తరగతి ప్రవేశాలకు తెలంగాణకు చెందిన బాలురు, బాలికల నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది. ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, వైవా-వాయిస్, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది.  విద్యార్థులు అక్టోబరు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 2న పరీక్ష నిర్వహించనున్నారు.


వివరాలు..


* ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు జులై- 2024 టర్మ్


అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి  2024, జులై  1 నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.


వయసు: 01.07.2024 నాటికి 11.5 - 13 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.2011 - 01.01.2013 మధ్య జన్మించి ఉండాలి.


దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.555 చెల్లించాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఆర్ఐఎంసీ పంపిన దరఖాస్తు ఫారం నింపి అవసరమైన ధ్రువతపత్రాలు జతచేసి హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌సర్వీస్ కమిషన్ చిరునామాకు పంపించాలి.


ఎంపిక విధానం: రాత పరీక్ష, వైవా వోస్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.


పరీక్షా విధానం: రాత పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అవి మ్యాథమేటిక్స్(200 మార్కులు), జనరల్ నాలెడ్జ్(75 మార్కులు), ఇంగ్లిష్(125 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో అర్హత సాధించినఅభ్యర్థులకు వైవా వోస్(50 మార్కులు) నిర్వహిస్తారు. రాత పరీక్ష, వైవా వోస్ కలిపి మొత్తం 450 మార్కులకు కేటాయించారు. దీనిలో కనీస ఉత్తీర్ణత మార్కులు 50% ఉండాలి. ఈ రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.


పరీక్షా కేంద్రం: హైదరాబాద్‌లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు.


ముఖ్యమైన తేదీలు..


దరఖాస్తుకు చివరితేది: 15.10.2023.


పరీక్ష తేది: 02.12.2023.


Online Fee Payment


Website




ALSO READ:


నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్-2023 నోటిఫికేషన్, పరీక్ష ఎప్పుడంటే?
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రకటనను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం తాజాగా విడుదల చేసింది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు వీరికి స్కాలర్‌షిప్ అందుతుంది. ఏడో తరగతిలో కనీసం 55 శాతం మార్కులు పొందిన విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులు. తుది  ఎంపిక సమయం నాటికి ఎనిమిదో తరగతిలో 55 శాతం మార్కులు పొంది ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000 మించకూడదు. ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలో చదవుతూ ఉండాలి.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..