తెలంగాణ రాష్ట్రంలోని  23 ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు, 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.  బోధనా మాధ్యమం ఇంగ్లీషులో సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తారు. అర్హులైన గిరిజన, ఆదివాసి గిరిజన, సంచార గిరిజన, పాక్షిక సంచార గిరిజన, డీనోటిఫైడ్ ట్రైబ్ తదితర కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఏప్రిల్ 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మే 7న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, విద్య, శిక్షణ అందిస్తారు.


పరీక్ష వివరాలు..


* తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు


* ఈఎంఆర్ఎస్ సెలెక్షన్ టెస్ట్(ఈఎంఆర్ఎస్ఎస్‌టీ), ఈఎంఆర్ఎస్ లేటర్ఎంట్రీ టెస్ట్(ఈఎంఆర్ఎస్ఎల్‌టీ)


సీట్ల సంఖ్య: ప్రతి ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయంలో ఆరో తరతగతిలో 60 సీట్ల చొప్పున మొత్తం 23 విద్యాలయాల్లో 1,380(690 బాలురు, 690 బాలికలు) సీట్లు కెటాయించారు. ఏడో తరగతిలో 26(18 బాలికలు, బాలురు 8), ఎనిమిదో తరగతిలో 103(55 బాలికలు, బాలురు 48), తొమ్మిదో తరగతిలో 104 (59 బాలికలు, బాలురు 45) మొత్తం 233 సీట్లు ఉన్నాయి.


అర్హతలు: ఆరో తరతగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకొనే  విద్యార్థులు తప్పనిసరిగా 2022-23 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి. 7, 8, 9 తరగతుల్లో ప్రవేశానికి వరుసగా 6, 7, 8 తరగతుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష(పట్టణ ప్రాంతం), రూ.లక్షన్నర(గ్రామీణ ప్రాంతం) మించకూడదు.


వయోపరిమితి: 31.03.2023 నాటికి 6వ తరగతికి 10-13 సంవత్సరాలు.. ఏడో తరగతికి 12-15 సంవత్సరాలు, ఎనిమిదో తరగతికి 13-16 సంవత్సరాలు, తొమ్మిదో తరగతికి 14-17 సంవత్సరాల మధ్య ఉండాలి. దివ్యాంగులకు రెండేళ్ల వయోసడలింపు ఉంటుంది.


దరఖాస్తు ఫీజు: రూ.100.


దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


ఎంపిక విధానం: రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.


పరీక్ష విధానం: ఆరో తరగతికి మొత్తం 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ- 50 ప్రశ్నలు, అరిథ్‌మెటిక్- 25 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్&తెలుగు- 25 ప్రశ్నలు అడుగుతారు. 7, 8, 9 తరగతులకు మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్- 10 ప్రశ్నలు, రీజినల్ లాంగ్వేజ్&తెలుగు- 10 ప్రశ్నలు, మ్యాథ్స్- 30 ప్రశ్నలు, సైన్స్- 30 ప్రశ్నలు, సోషల్ సైన్స్- 20 ప్రశ్నలు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష నిర్వహిస్తారు.


ముఖ్యమైన తేదీలు..


➥ దరఖాస్తుకు చివరి తేదీ: 20.04.2023.


➥ ప్రవేశ పరీక్ష: 07.05.2023.


➥ పరీక్ష ఫలితాలు వెల్లడి: 30.05.2023.


➥ మొదటి దశ ప్రవేశాలు: 01.06.2023 నుంచి 10.06.2023.


Notification


Application Form  


Website 


ALso Read:


1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
తెలంగాణలోని బోధనాసుపత్రుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారి మెరిట్ జాబితాను వైద్యారోగ్యసేవల రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. ఈ జాబితాకు సంబంధించిన అభ్యంతరాలుంటే మార్చి 29న ఉదయం 10.30 నుంచి ఏప్రిల్ 1న సాయంత్రం 5.30 గంటలలోపు తెలపాలని బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి మార్చి 28న ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు లాగిన్ ద్వారా మాత్రమే అభ్యంతరాలను తెలపాలని, ఇతర రూపాల్లో పంపితే పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మెడికల్ టీచర్లు అందుబాటులో లేకుంటే ఖాళీల్లో 15 శాతం పోస్టులను నాన్ మెడికల్ టీచర్లతో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 34 విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించనున్నారు. అత్యధికంగా గైనకాలజీ 187 పోస్టులు, అనస్థీషియాలో 177 పోస్టులు భర్తీ కానుండగా తర్వాత స్థానాల్లో జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ విభాగాలు ఉన్నాయి.
మెరిట్ జాబితా కోసం క్లిక్ చేయండి.. 


జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష - దరఖాస్తు ప్రారంభం ఎప్పుడంటే?
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2023 పరీక్ష షెడ్యూలు ఇటీవల వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ గువాహటి నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనుంది. జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఏప్రిల్‌ 30 నుంచి మే 7 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జేఈఈ మెయిన్‌-1 పూర్తికాగా, ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్‌-2 నిర్వహించనున్నారు. ఈ రెండు సెషన్ల ఫలితాలను ఏప్రిల్ చివరివారంలో వెల్లడించే అవకాశం ఉంది. పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధిస్తారు. దీని ఫలితాల ఆధారంగా ఐఐటీల్లో నాలుగేళ్ల బీటెక్‌, బీఎస్‌, బీఆర్క్‌, ఐదేళ్ల డ్యూయల్‌ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
జేఈఈ అడ్వాన్స్‌ నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి.. 


జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి, ఎప్పుడంటే?
దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2023 సెషన్-2కు సంబంధించి అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలోనే విడుదల చేయనుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 12 వరకు సెషన్-2 పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షల అడ్మిట్ కార్డులను వారం రోజుల్లో అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నట్టు ఎన్టీఏ తెలిపింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..