తెలంగాణలోని బోధనాసుపత్రుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారి మెరిట్ జాబితాను వైద్యారోగ్యసేవల రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. ఈ జాబితాకు సంబంధించిన అభ్యంతరాలుంటే మార్చి 29న ఉదయం 10.30 నుంచి ఏప్రిల్ 1న సాయంత్రం 5.30 గంటలలోపు తెలపాలని బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి మార్చి 28న ఒక ప్రకటనలో తెలిపారు.


ఆన్‌లైన్‌లో దరఖాస్తు లాగిన్ ద్వారా మాత్రమే అభ్యంతరాలను తెలపాలని, ఇతర రూపాల్లో పంపితే పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మెడికల్ టీచర్లు అందుబాటులో లేకుంటే ఖాళీల్లో 15 శాతం పోస్టులను నాన్ మెడికల్ టీచర్లతో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 34 విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించనున్నారు. అత్యధికంగా గైనకాలజీ 187 పోస్టులు, అనస్థీషియాలో 177 పోస్టులు భర్తీ కానుండగా తర్వాత స్థానాల్లో జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ విభాగాలు ఉన్నాయి.


మెరిట్ జాబితా కోసం క్లిక్ చేయండి..




 


Also Read:


IISER లో 21 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు, వివరాలు ఇలా!
మొహాలీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(ఐసర్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిద్వారా మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నారు.  పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 12 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఢిల్లీ యూనివర్సిటీలో 106 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు, వివరాలు ఇలా!
ఢిల్లీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఒకేషనల్ స్టడీస్‌ వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 106 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, నెట్/ జేఆర్‌ఎఫ్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


బొకారో స్టీల్ ప్లాంటులో 239 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు - అర్హతలివే!
జార్ఖండ్ రాష్ట్రంలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)కు చెందిన బొకారో స్టీల్ ప్లాంట్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిద్వారా మొత్తం 239 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...