TSECET Result 2021 LIVE Updates: ఈరోజే తెలంగాణ ఈసెట్ ఫలితాలు..
తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2021 ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఈసెట్ ఫలితాలను బుధవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు జేఎన్టీయూ హైదరాబాద్ ప్రకటించింది.
తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి ఈసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల్లో 95.16 శాతం మంది అర్హత సాధించినట్లు పాపిరెడ్డి తెలిపారు.
- ఈసెట్ అధికారిక వెబ్‌సైట్ ecet.tsche.ac.inను ఓపెన్ చేయండి.
- ఇందులో ఉన్న TS ECET 2021 రిజల్ట్స్ లింక్ క్లిక్ చేయండి. దీంతో మరో పేజీ ఓపెన్ అవుతుంది.
- ఈ పేజీలో అభ్యర్థులు తమ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి.
- వ్యూ/డౌన్‌లోడ్ రిజల్ట్ మీద క్లిక్ చేయండి.
- ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.
- భవిష్యత్ అవసరాల కోసం వీటిని డౌన్‌లోడ్ చేసుకోండి.
Background
తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET) ఫలితాలు ఈ రోజు (ఆగస్టు 18) విడుదల కానున్నాయి. ఈసెట్ ఫలితాలను బుధవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు జేఎన్టీయూ హైదరాబాద్ ప్రకటించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, జేఎన్టీయూ హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేస్తారు. విద్యార్థులు తమ ర్యాంకు కార్డులను ecet.tsche.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కాగా, పాలిటెక్నిక్ అభ్యర్థులు ఇంజనీరింగ్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈసెట్ పరీక్ష నిర్వహిస్తారు. టీఎస్ ఈసెట్- 2021 పరీక్షను ఆగస్టు 3న నిర్వహించారు.ఈసెట్ పరీక్షలకు అన్ని విభాగాలు, సబ్జెక్టులలో కలిపి మొత్తం 24,808 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 95.46 శాతం మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -