TSECET 2024 Application: తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాల‌కు డిప్లొమా, బీఎస్సీ విద్యార్థులకు నిర్వహించే 'టీఎస్ఈసెట్‌-2024' నోటిఫికేషన్ ఫిబ్రవరి 14న విడుదలైంది. ప్రవేశ పరీక్ష కోసం ఫిబ్రవరి 15న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 16 వరకు ద‌ర‌ఖాస్తుల‌ు స్వీక‌రించ‌నున్నారు. అయితే రూ.500 ఆల‌స్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు, రూ.1000తో ఏప్రిల్ 28 వరకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అభ్యర్థులు ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 28 మధ్య దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చు.

పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మే 1 నుంచి సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 6న ఈసెట్ ప్రవేశ ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఆధ్వర్యంలో పరీక్ష జ‌ర‌గ‌నుంది. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీరాం వెంకటేశ్​ను ఈసెట్ కన్వీనర్​గా వ్యవహరిస్తున్నారు. ఈసెట్ ద్వారా బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సు్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. 

వివరాలు...

➥ టీఎస్ఈసెట్- 2024

ప్రవేశ కోర్సులు: బీఈ/ బీటెక్/ బీఫార్మసీ.

అర్హత‌:  కనీసం 45 శాతం మార్కులతో స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక‌ విధానం: కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్‌-2023) ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.900. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.

పరీక్ష విధానం:

ముఖ్యమైన తేదీలు..

➥ నోటిఫికేషన్ వెల్లడి: 14.02.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.02.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.04.2024.

➥ రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 22.04.2024.

➥ రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 28.04.2024.

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 24.04.2024 నుంచి 28.04.2024 వరకు.

➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 01.05.2024.

➥ ఈసెట్ పరీక్ష తేది: 06.05.2024.

పరీక్ష సమయం: ఉ. 09:00 - మ.12:00 (ECE, EIE, CSE, EEE, CIV, MEC, CHE, MIN, MET, PHM, BSM)

Notification

Online Application

తెలంగాణ సెట్ కన్వీనర్లు వీరే..

సెట్ పేరు నిర్వహణ యూనివర్సిటీ కన్వీనర్
టీఎస్ ఎప్‌సెట్(ఈఏపీసెట్)  జేఎన్టీయూహెచ్‌ ప్రొఫెసర్ దీన్ కుమార్​ 
టీఎస్ ఈసెట్  ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీరాం వెంకటేశ్​
టీఎస్ లాసెట్/పీజీఎల్‌సెట్ ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ లీగల్ సెల్ డైరెక్టర్​ విజయలక్ష్మి
టీఎస్ పీజీఈసెట్ జేఎన్టీయూహెచ్‌ అరుణ కుమారి
టీఎస్ ఐసెట్  కాకతీయ యూనివర్సిటీ నరసింహాచారి 
టీఎస్ పీఈసెట్ శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజేశ్ కుమార్ 
టీఎస్ ఎడ్‌సెట్ మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ మృణాళిని

ALSO READ:

TS EAPCET 2024: ఫిబ్రవరి 21న ఈఏపీసెట్ నోటిఫికేషన్, దరఖాస్తు తేదీలివే..
తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న 'టీఎస్ ఈఏపీసెట్ షెడ్యూలు విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 21న ఈఏపీసెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 9 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మే 9 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ కోర్సుల‌కు ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అలాగే మే 12న అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఉన్నత విద్యామండ‌లి ఇటీవలే ఎంసెట్ పేరును ఈఏపీసెట్‌గా మార్చిన సంగతి తెలిసిందే. జేఎన్టీయూ హైదరాబాద్ పరీక్షలు నిర్వహించనుంది. 
ఇతర పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..