ఎంసె‌ట్‌లో సీట్లు పొందనివారు, ఎంసెట్‌ క్వాలిఫై కాని‌ వా‌రి కోసం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. నవంబరు 2, 3 తేదీల్లో నిర్వహించే స్పాట్ అడ్మిషన్స్ ద్వారా విద్యార్థులు సీట్లు పొందవచ్చు. అయితే వీరికి ఫీజు రీయిం‌బ‌ర్స్‌‌మెంట్‌ మాత్రం వర్తించదు. ఫీజు చెల్లించే స్థోమత ఉన్నవారు నవంబరు 2, 3 తేదీల్లో ఎంసెట్‌ స్పాట్‌ అడ్మి‌షన్స్‌ ద్వారా సీటును పొంద‌వచ్చు.


ఇంజి‌నీ‌రింగ్‌ కౌన్సె‌లింగ్‌ ముగి‌య‌డంతో నవంబరు 3 వరకు స్పాట్‌ అడ్మి‌ష‌న్లకు అవ‌కాశం కల్పించారు అధికారులు. ఈ ఏడాది బీటె‌క్‌లో 63, 899 సీట్లు కౌన్సె‌లిం‌గ్‌లో నిండాయి. సీట్లు పొందిన వారిలో ఇప్పటి‌వ‌రకు 57,500 మంది విద్యా‌ర్థులు మాత్రమే నిర్దే‌శిత ఫీజు చెల్లించి, ఆయా కాలే‌జీల్లో రిపో‌ర్ట్‌‌చే‌శారు. దాంతో 6,399 వరకు సీట్లు మిగి‌లి‌పోగా, కౌన్సె‌లిం‌గ్‌లో భర్తీ‌కా‌నివి మరో 19,421 సీట్లు‌న్నాయి. మొత్తం 25 వేల సీట్లను స్పాట్‌ అడ్మి‌షన్స్‌ ద్వారా భర్తీ చేస్తారు.


నవంబరు 3 నుంచే తరగతులు
జేఎ‌న్టీయూ పరి‌ధి‌లోని కాలే‌జీల్లో ఇంజి‌నీ‌రింగ్‌ మొదటి సంవ‌త్సరం తర‌గ‌తులు నవంబరు 3 నుంచి ప్రారం‌భం‌కా‌ను‌న్నాయి. ఓయూ పరిధి కాలే‌జీల్లో తర‌గ‌తు‌లను బుధ‌వారం నుంచే నిర్వహి‌స్తారు. ఈ సంద‌ర్భంగా విద్యా‌ర్థు‌లకు ఇండ‌క్షన్‌ ప్రోగ్రాంలు నిర్వ‌హించి ఇంజి‌నీ‌రింగ్‌ కోర్సుల ప్రాధా‌న్యాన్ని అధి‌కా‌రులు వివ‌రిం‌చ‌ను‌న్నారు.


స్పాట్ అడ్మిషన్స్ నిబంధనలివే!


➤ ఖాళీ సీట్లను తొలుత ఎంసె‌ట్‌లో క్వాలిఫై అయ్యి.. ఇంటర్‌ పాస్‌ అయిన వారితో భర్తీ‌చే‌స్తారు. ఆ తర్వాత మిగులు సీట్లను ఎంసెట్‌ రాయని వారితో భర్తీ చేస్తారు.

➤ ఒరి‌జి‌నల్‌ సర్టి‌ఫి‌కెట్లు ఉన్న వారికి మాత్రమే స్పాట్‌ అడ్మి‌ష‌న్లకు అవ‌కాశం కల్పి‌స్తారు. అయితే సర్టి‌ఫి‌కెట్లను పరి‌శీ‌లించి తిరిగి ఇచ్చే‌స్తారు. ఒక్క ఒరి‌జి‌నల్‌ టీసీతో పాటు జిరాక్స్‌ పత్రా‌లను మాత్రమే తీసు‌కొం‌టారు.

➤ ఇతర రాష్ట్రా‌లకు చెందిన వారు అన‌ర్హులు.

➤అడ్మి‌షన్లు పొందిన తర్వాత ఎంసెట్‌ కన్వీనర్‌ ధ్రువీ‌క‌రి‌స్తేనే అడ్మి‌షన్లు పొంది‌నట్లు అవుతుంది.


ఎంసెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి, ఇంకా 15,447 సీట్లు ఖాళీనే!!


యాజమాన్య కోటా భర్తీకి గడువు పెంపు...
యాజమాన్య కోటా(బీ కేటగిరీ) కింద బీటెక్ సీట్లను భర్తీ చేసుకునేందుకు గడువును నవంబరు 5 వరకు పొడిగించారు. అక్టోబరు 25 వరకు ఉన్న ఈ గడువును మరో 10 రోజులు పెంచుతూ ఉన్నతవిద్యామండలి నిర్ణయం తీసుకుంది. స్పాట్ అడ్మిషన్లు, ప్రయివేటు అన్ ఎయిడెడ్ ఇంజినీరింగ్‌, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన నిబంధనలను అక్టోబరు 26 లేదా 27 తేదీల్లో ఎంసెట్ ప్రవేశాల వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు.


Also Read:


ఐఎస్‌బీలో పీజీ ప్రోగ్రామ్, వీరు మాత్రమే అర్హులు!!
ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ)- పీజీ ప్రోగ్రామ్‌ ప్రో(పీజీపీ ప్రో)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌, ఆంత్రప్రెన్యూర్స్‌కు ఉద్దేశించించిన ఈ ప్రోగ్రామ్‌ వ్యవధి 18 నెలలు. హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, బెంగళూరు క్యాంపస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇది వీకెండ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌. ఇందులో ఫౌండేషన్‌ కోర్సులు, కోర్‌ కోర్సులు, అడ్వాన్స్‌డ్‌ కోర్సులు, స్పెషలైజేషన్‌ కోర్సులు ఉంటాయి. ఆల్టర్‌నేట్ వీకెండ్‌ తరగతులు నిర్వహిస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం- చివరితేది ఎప్పుడంటే?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు నిర్దేశించిన 'NIFT-2023' రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది (2023) ఫిబ్రవరి 5న NIFT-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 
కోర్సులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..