తెలంగాణలో ఎంఈ, ఎంటెక్‌, ఎం.ఆర్క్‌, ఎం.ఫార్మసీ, ఫార్మ్‌-డి కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి 'టీఎస్‌ పీజీఈసెట్‌-2023' చివరి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ సెప్టెంబరు 20న ప్రారంభమైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 20 నుంచి 24 వరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ అప్‌లోడింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 26న అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. దరఖాస్తు వివరాల్లో ఏమైనా తప్పులుంటే ఈమెయిల్ ద్వారా వెల్లడిస్తారు.


అభ్యర్థులకు సెప్టెంబరు 27, 28 తేదీల్లో వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. సెప్టెంబరు 29న ఆప్షన్ల సవరణకు అవకాశం ఇవ్వనున్నారు. తర్వాత సీట్ల కేటాయింపు వివరాలను కళాశాలలవారీగా అక్టోబరు 2న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సీట్లు పొందినవారు అక్టోబరు 3 నుంచి 7 మధ్య సంబంధిత కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికేట్లతోపాటు ట్యూషన్ ఫీజు చెల్లింపు రసీదుతో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. గతేడాది మాదిరిగానే సుమారు 11 వేల సీట్లుండగా.. అందులో 70 శాతం(7700 సీట్లు) వరకు కన్వీనర్ కోటా కింద కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. 


పీజీఈసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూలు ఇలా..


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్: 20.09.2023 - 24.09.2023.


➥ అర్హులైన అభ్యర్థుల ప్రాథమిక జాబితా వెల్లడి: 26.09.2023.


➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 27.09.2023 - 28.09.2023.


➥  వెబ్‌ఆప్షన్ల సవరణ: 29.09.2023.


➥ సీట్ల కేటాయింపు: 02.10.2023.


➥ సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 03.10.2023 - 07.10.2023.


కౌన్సెలింగ్ నోటిఫికేషన్


కౌన్సెలింగ్ వెబ్‌సై‌ట్


ALSO READ:


జేఈఈ మెయిన్‌, నీట్‌ షెడ్యూలు విడుదల - ఇతర పరీక్షల తేదీలు ఇలా
దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి 2024-25 విద్యా సంవత్సరానికి నిర్వహించే పలు ప్రవేశ పరీక్షల వార్షిక క్యాలెండర్‌ను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)'  ప్రకటించింది. ఎన్టీఏ ప్రకటించిన పరీక్షల షెడ్యూలులో నీట్, జేఈఈ, సీయూఈటీ, నెట్ వంటి పరీక్షల తేదీలు ఉన్నాయి. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల షెడ్యూలును అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆయా పరీక్షల రిజిస్ట్రేషన్ సమయంలో వెల్లడించనున్నట్లు ఎన్‌టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. కంప్యూటర్ ఆధారంగా జరిగే పరీక్షల ఫలితాలను.. పరీక్షలు జరిగిన మూడు వారాల్లోపు ప్రకటిస్తామని ఎన్టీఏ వెల్లడించింది. ఇక, నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాలను వచ్చే ఏడాది జూన్ రెండో వారంలో ప్రకటించనున్నట్లు ఎన్టీఏ తెలిపింది. 
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


అంబేడ్కర్ 'దూరవిద్య' డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. ఇప్పటికే పలుమార్లు పొడిగించిన ప్రవేశ గడువును పెంచిన యూనివర్సిటీ మరోసారి 15 రోజులపాటు పొడిగించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థుల అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగించారు. అభ్యర్థులు సెప్టెంబరు 30 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600, 040-23680290/ 291/294/295 నంబర్లలో సంప్రదించవచ్చు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...