తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ ఖరారైంది. మార్చి 1న లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూలును ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డి.రవీందర్, లాసెట్ కన్వీనర్ బి.విజయలక్ష్మీతో కలిసి ఆయన విడుదల చేశారు. మార్చి 2 నుంచి ఏప్రిల్ 6 వరకు లాసెట్, పీజీఎల్ సెట్‌కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో మే 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 16 నుంచి పరీక్ష హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. మే 25న పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌‌ చూడవచ్చని అధికారులు సూచించారు.


మార్చి 2 నుంచి లాసెట్‌ దరఖాస్తులు..
మార్చి 1న టీఎస్‌ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.600గా, ఓపెన్‌ కేటగిరి అభ్యర్థులకు రూ.900గా నిర్ధారించించారు. రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 12 వరకు, రూ.వెయ్యితో ఏప్రిల్‌ 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎడిట్‌ చేసుకునేందుకు మే 5 నుంచి 10 వరకు అవకాశం కల్పించగా, మే 16 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 25న టీఎస్‌ లాసెట్‌, టీఎస్‌ పీజీఎల్‌సెట్‌ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. లాసెట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి, ఓయూ వీసీ డి.రవీందర్‌, లాసెట్‌ కన్వీనర్‌ బి.విజయలక్ష్మీ కలిసి మాసాబ్‌ ట్యాంక్‌లోని కార్యాలయంలో విడుదల చేశారు.


ఈసెట్ షెడ్యూలు కూడా..
మార్చి 1న ఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. మార్చి 2 నుంచి మే 2 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో మే 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 15 నుంచి హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. మే 20న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.


Also Read:


ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌, ఎంసెట్‌ సిలబస్‌ తగ్గింపు!
తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఏడాది నిర్వహించే ఎంసెట్‌లో సిలబస్‌ను తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. మేలో నిర్వహించే ఈ ఎంట్రెన్స్‌లో ఫస్టియర్‌ నుంచి 70 శాతం, సెకండియర్‌లో 100 శాతం సిలబస్‌ నుంచి ప్రశ్నలు రానున్నాయి. ఈ మేరకు సిలబస్‌ను ఎంసెట్‌ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థమే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీలో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్, వివరాలు ఇలా!
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ 2023 విద్యా సంవత్సరానికి బీటెక్, మాస్టర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రాంలో ప్రవేశానికి సంబంధించి లేటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ వెలువడింది. ఈసీఈ విభాగానికి బీఈ, బీటెక్ (ఈసీఈ/ ఈటీఈ/ ఈఐఈ/ ఈఈఈ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్); సీఎస్ఈ విభాగానికి బీఈ, బీటెక్ (సీఎస్ఈ/ ఐటీ/ ఏఐ అండ్ ఎంల్, డేటా సైన్స్) మూడో సెమిస్టర్ 80 శాతం మార్కులతో పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 31 వరకు దరఖాస్తుచేసుకోవచ్చు.
పూర్తి వివరాలకోసం క్లిక్ చేయండి.. 



నీట్‌ పీజీ-2023 అడ్మిట్‌ కార్డులు వచ్చేశాయ్! ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి!
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ పీజీ)-2023 అడ్మిట్ కార్డులను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) ఫిబ్రవరి 27న విడుదల చేసింది. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నీట్‌ పీజీ-2023 పరీక్ష యథాతథంగా మార్చి 5న కంప్యూటర్ ఆధారిత విధానంలో జరగనుంది. పరీక్ష వాయిదా వేయాలంటూ దేశ వ్యాప్తంగా మెడికల్ విద్యార్థులు కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నా అందుకు కేంద్రం ససేమిరా అంది. తాజాగా సుప్రీం కోర్టులో కూడా నీట్ పీజీ-2022 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిని విచారించిన అత్యున్నత ధర్మాసనం పరీక్షను వాయిదా వేయడం వల్ల విద్యార్ధుల్లో గందరగోళం, అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉందని తీర్పునిచ్చింది. దీంతో పరీక్ష ముందు ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే జరగనుంది. పరీక్ష తేదీలో ఎటువంటి మార్పు లేదని ఇప్పటికే మెడికల్ బోర్డు కూడా స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 271 పరీక్ష కేంద్రాల్లో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..