తెలంగాణలో పీజీ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీజీఈసెట్)-2023 హాల్‌టికెట్లను జేఎన్‌టీయూ హైదరాబాద్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేది, పరీక్ష పేపర్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు పీజీఈసెట్ దరఖాస్తు గడువు రూ.2500 ఆలస్య రుసుముతో మే 24తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ చివరి అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
టీఎస్ పీజీఈసెట్ 2023 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష సమయానికి గంటన్నర ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 8.30 గంటలకు, మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష షెడ్యూలు ఇలా..
2023-24 విద్యా సంవత్సరంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్/ఫార్మసీ/ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ఫుల్‌టైం ఎంఈ, ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పీజీఈసెట్‌ను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
పరీక్ష విధానం:
మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు, పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతం (30 మార్కులు)గా నిర్నయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
నోటిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
Also Read:
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పుడంటే?
తెలంగాణలో ఎంసెట్ ఫలితాల వెల్లడికి సమయం ఆసన్నమైంది. మే 25న ఎంసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ డా. బి.డీన్ కుమార్ మే 23న ఒక ప్రకటనలో తెలిపారు. మే 25న ఉదయం 11 గంటలకు కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ క్యాంపస్‌లోని గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్‌లో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ఉన్నత విద్యా కార్యదర్శి వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, జేఎన్‌టీయూ-హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తదితరులు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మే 25 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్, ముఖ్యమైన తేదీలివే!
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు మే 25 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి మే 22న ఒక ప్రకటనలో తెలిపారు. పాలిసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మే 25 నుంచి జూన్ 1 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. మే 29 నుంచి జూన్ 5 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. జూన్ 1 నుంచి 6 వరకు కళాశాలలు, కోర్సు ఎంపికకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జూన్ 7న వెబ్‌ఆప్షన్లలో మార్పు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక జూన్ 9న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులకు జూన్ 15 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
పాలిసెట్ కౌన్సెలింగ్ కోసం క్లిక్ చేయండి..