TG EAPCET 2024 Counselling Notification: తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన 'టీజీ ఎప్‌సెట్ -2024' కౌన్సెలింగ్ నోటిఫికేషన్ (పేపర్ ప్రకటన)ను ఉన్నత విద్యామండలి మే 29న విడుదల చేసింది. మే 24న సమావేశమైన ప్రవేశాల కమిటీ కౌన్సెలింగ్ షెడ్యూలును ఖరారుచేసిన సంగతి తెలిసిందే. తాజాగా కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్ వెలువడింది. కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందే విద్యార్థులు తమ పదోతరగతి, ఇంటర్ మార్కుల మెమోలు, టీసీ, ఇన్‌కం, క్యాస్ట్ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. 

➥ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మొత్తం మూడు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

➥ మొదటి విడత కౌన్సెలింగ్ జూన్ 27 నుంచి జులై 12 వరకు నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు జూన్ 30 నుంచి వెబ్‌ ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లను నమోదుచేసుకున్నవారికి జులై 12న మొదటి విడత సీట్లను చేటాయిస్తారు.

➥ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను జులై 19 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. ఈ దశలో జులై 19 నుంచి వెబ్ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. అనంతరం జులై 24న రెండో విడత సీట్లను కేటాయిస్తారు.

➥ ఇక చివరగా మిగిలిన సీట్ల భర్తీకి జులై 30 నుంచి ఆగస్టు 5 వరకు చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అయితే ఇంటర్నల్ స్లైడింగ్ ఆన్‌లైన్‌లో కన్వీనర్ ద్వారా చేపట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇందుకుగాను ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆగస్టు 16న ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయించనున్నారు. అదేవిధంగా స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను ఆగస్టు 17న విడుదల చేయనున్నారు. 

టీఎస్ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూలు..

ఇంజినీరింగ్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం 27.06.2024
మొదటి విడత వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం 30.06.2024
మొదటి విడత సీట్ల కేటాయింపు 12.07.2024
రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం 19.07.2024
రెండో విడత సీట్ల కేటాయింపు 24.07.2024
తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం 30.07.2024
తుది విడత సీట్ల కేటాయింపు 05.08.2024
ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభం 12.08.2024
ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయింపు 16.08.2024
స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల 17.08.2024

తెలంగాణలో టీఎస్‌ఈఏపీసెట్‌-2024 ప్రవేశ పరీక్షకు సంబంధించి మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మే 7న పరీక్షకు మొత్తంగా, 33,500 మందికి గాను 30,288 మంది మొదటి సెషన్‌లో, 33,505 మందికి గాను 30,571 మంది రెండో సెషన్‌లో పరీక్ష రాశారు. ఇక మే 8న నిర్వహించిన పరీక్షకు మొత్తం 33,427 మందికిగాను 30,641 మంది హాజరయ్యారు.

ఇక రాష్ట్రంలో ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ పరీక్షలు మే 9న ప్రారంభమైన సంగతి తెలిసిందే. మే 11తో పరీక్షలు ముగిశాయి. పరీక్షల మొదటిరోజు ఉదయం విడతకు 50,978 మందికిగాను.. 48,076 (94.3 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక 2,902 (5.7 శాతం) మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఇక మధ్యాహ్నం విడతకు 50,983 మందికిగాను.. 48,152 (94.4 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారని పేర్కొన్నారు. 2,831 (5.6 శాతం) మంది గైర్హాజరయ్యారు. ఇక పరీక్షల రెండో రోజు 50,990 మందికిగాను.. 48,097 (94.3 శాతం) మంది  మధ్యాహ్నం విడతలో 50,987 మందికిగాను.. 48,318 (94.8 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు. 

ALSO READ:

ఏపీ ఎప్‌సెట్-2024 ఫలితాలు వచ్చేస్తున్నాయ్, రిజల్ట్స్ ఎప్పుడంటే?
ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎప్‌సెట్-2024 పరీక్షలు నిర్వహించారు. మే 16 నుంచి 23 వరకు పరీక్షలు జరగడం తెలిసిందే. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు మే 16, 17 తేదీల్లో, ఇంజినీరింగ్‌ విభాగానికి మే 18 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో ఎప్‌సెట్ 2024 పరీక్షలు నిర్వహించారు. ఎప్‌సెట్ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో 93.47 శాతం విద్యార్థులు హాజరయ్యారు.జూన్ మొదటివారంలో ఎప్‌సెట్ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..