APBIE INTER HALLTICKETS: తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు ఫిబ్రవరి 20 విడుదలకానున్నాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎస్సెస్సీ లేదా మొదటి ఏడాది హాల్‌టికెట్ నంబరుతో థియరీ పరీక్షల హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెండో ఏడాది వారు మొదటి సంవత్సరం లేదా రెండో ఏడాది హాల్‌టికెట్ నంబరుతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లలో ఫొటోలు, సంతకాలు, ఇతర సవరణలు అవసరమైతే కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లి, సరిచేయించుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు.
ఇంటర్ పరీక్షల షెడ్యూలు..
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు..
➥ 28-02-2024: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I
➥ 01-03-2024: ఇంగ్లిష్ పేపర్-I
➥ 04-03-2024: మ్యాథమెటిక్స్ పేపర్-IA, బాటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్-I
➥ 06-03-2024: మ్యాథమేటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్-I
➥ 11-03-2024: ఫిజిక్స్ పేపర్-I, ఎకనామిక్స్ పేపర్-I
➥ 13-03-2024: కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ పేపర్-I
➥ 15-03-2024: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-I
➥ 18-03-2024: మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-I, జియోగ్రఫీ పేపర్-I
ఇంటర్ సెకండ్ పరీక్షలు..
➥ 29-02-2024: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
➥ 02-03-2024: ఇంగ్లిష్ పేపర్-II
➥ 05-03-2024: మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బాటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II
➥ 07-03-2024: మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II
➥ 12-03-2024: ఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ పేపర్-II
➥ 14-03-2024: కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్-II
➥ 16-03-2024: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-II
➥ 19-03-2024: మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-II, జియోగ్రఫీ పేపర్-II
ALSO READ:
'హోటల్ మేనేజ్‌మెంట్' కోర్సుతో ఉజ్వల భవిత, వివరాలు ఇలా
హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో మూడేళ్ల బీఎస్సీ కోర్సులో ప్రవేశానికి 'నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (NCHM JEE)'-2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా.. మార్చి 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 2 నుంచి 5 వరకు దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి దేశవ్యాప్తంగా 109 కేంద్రాల్లో మే 11న కంప్యూటర్ ఆధారిత విధానంలో ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను వారం ముందునుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. విద్యార్హత చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1000; జనరల్-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.700; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థుల రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..