Helicopter in Medaram: మేడారంలో హెలికాప్టర్ సేవలు రెడీ, రెండు రకాల ప్యాకేజ్‌లు - ఇలా బుక్ చేసుకోవచ్చు

Medaram Jatara: మేడారం జాతరకు తెలంగాణ కుంభమేళా గా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు ఎడ్ల బండ్లతో జరిగిన జాతర ఇప్పుడు హెలికాఫ్టర్ స్థాయికి చేరుకుంది.

Continues below advertisement

Sammakka Saralamma Jatara Helicopter Services: ఆదివాసీల జాతర మేడారం మహా కుంభమేళా జాతర రేపటి నుంచే ప్రారంభం కానుంది. ఇప్పటికే అధిక సంఖ్యలో భక్తులు మేడారానికి చేరుకుని సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకూ వన దేవతల జాతర జరగనున్నందున అమ్మల దర్శనం మరింత సులభతరం చేసేలా, జాతర అద్భుత దృశ్యాన్ని గగనతలం నుంచి చూసేలా హెలికాఫ్టర్ సేవలు ఈసారి కూడా అందుబాటులోకి రానున్నాయి. పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా, భక్తులు ఓ ప్రత్యేక అనుభూతి పొందేలా రాష్ట్ర పర్యాటక శాఖ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. భక్తులు గగన విహారం చేస్తూ వనదేవతలను దర్శించుకోవచ్చు.

Continues below advertisement

వన దేవతలను గద్దెల దగ్గకు తీసుకొచ్చి ప్రతిష్టించడం నుంచి మొదలుకొని మళ్ళీ వన ప్రవేశం చేయించడం వరకు.. అన్నీ ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారమే జరుగుతుంది. మేడారం జాతరకు తెలంగాణ కుంభమేళా గా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు ఎడ్ల బండ్లతో జరిగిన జాతర ఇప్పుడు హెలికాఫ్టర్ స్థాయికి చేరుకుంది.. ఈసారి కూడా మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటు లోకి వచ్చాయి.

హైలికాప్టర్ రౌండ్ ట్రిప్ కు ధర ఇదీ..
ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. హనుమకొండ నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇలా వెళ్లిన వారికి ప్రత్యేక దర్శనం ఉంటుంది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. అలాగే, ప్రత్యేకంగా హెలికాప్టర్ జాయ్‌ రైడ్ కూడా ఉంటుంది. జాతర పరిసరాలను విహంగ వీక్షణం చేయవచ్చు. హన్మకొండ నుంచి మేడారం జాతరకు ప్రయాణికులు ఒక రౌండ్ ట్రిప్‌తో సహా వీఐపీ దర్శనాన్ని పొందవచ్చు. దీని ధర ఒక్కొక్కరికి రూ. 28,999.. హెలికాప్టర్​లో ఒకేసారి ఆరుగురు ప్రయాణించే వీలు ఉంది.

హెలికాప్టర్లో రైడ్‌కు మరో ధర
మరో రైడ్.. జాతర జరిగే ప్రాంతం మీదుగా 6 నుంచి 7 నిమిషాల పాటు గాలిలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టనుంది. అమ్మ వారి గద్దెల పక్క నుంచి మొద లయ్యే రైడ్‍ జంపన్న వాగు, చిలుకల గుట్ట పక్కనుంచి చుట్టూరా ఉండే జాతర పరిసరాల మీదుగా ఉంటుంది. దీని కోసం ఒక్కొక్కరి నుంచి రూ.4800 ఛార్జీ వసూలు చేయనున్నారు. 

హెలికాప్టర్ టిక్కెట్లు, ఇతర సమాచారం కోసం, ఈ ఫోన్ నంబర్‌లను సంప్రదించవచ్చు: 74834 33752, 040-03 99999, లేదా infor@helitaxi.comలో ఆన్‌లైన్‌ లో సంప్రదించవచ్చు.

Continues below advertisement