ఇంటర్‌లో ఈ ఏడాది 100 శాతం సిలబస్‌తో వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ అక్టోబరు 14న ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్ వల్ల గత రెండేళ్లు 70 శాతం సిలబస్‌తో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించామని ఆయన అన్నారు. ఈ సంవత్సరం 100 శాతం సిలబస్​తో పరీక్షలు నిర్వహించనున్నట్లు.. ఇందుకు సంబంధించిన సిలబస్, నమూనా ప్రశ్నాపత్రాలను ఇంటర్ బోర్డు వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచామని నవీన్ మిత్తల్ సూచించారు.


Website


అక్టోబరు 24 నుంచి ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ తరగతులు
ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయిందని నవీన్ మిత్తల్ వెల్లడించారు. 5,556 ఎంటెక్ సీట్లలో మొదటి విడతలో 2,522 సీట్లు భర్తీ చేసినట్టు చెప్పారు. 3,106 ఎంఫార్మసీ సీట్లలో మొదటి విడతలో 2,163 సీట్లు భర్తీ చేశామన్నారు. 153 ఎంఆర్క్ సీట్లలో మొదటి విడతలో 46 సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు. సీట్లు పొందినవారు అక్టోబరు 19 వరకు కళాశాలల్లో రిపోర్టు చేయాలని, అక్టోబరు 24 నుంచి ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ తరగతులు నిర్వహిస్తామని నవీన్ మిత్తల్ తెలిపారు.



పదోతరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం! ఇక నుంచి ఎన్ని పేపర్లంటే?
తెలంగాణలో పదోతరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పదోతరగతి పరీక్షలను 6 పేపర్లతోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 పేపర్లతో పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. హిందీ మినహా మిగతా సబ్జెక్టులకు రెండు పేపర్లు చొప్పున పరీక్షలు ఉంటున్నాయి. అయితే గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా ఆరు పేపర్ల విధానాన్ని అమలు చేశారు. కరోనా కారణంగా రెండేళ్ళ పాటు విద్యార్ధులకు పరీక్షల నిర్వహణలో రకరకాల సమస్యలు తలెత్తాయి. విద్యార్ధులు ఎలాంటి పరీక్షలు లేకుండానే 8,9 తరగతుల నుంచి ఉత్తీర్ణులై పదిలోకి వచ్చేశారు.

పదోతరగతి పరీక్ష విధానంపై సమీక్ష జరిపిన NCERT విద్యార్థులకు 11 రోజుల పాటు పరీక్షలు నిర్వహించడం వల్ల వారిపై ఒత్తిడి పెరుగుతోందని, వాటిని ఆరు పేపర్లకు కుదించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 6 పేపర్ల విధానానికే మొగ్గు చూపింది. పదో తరగతి విధి విధానాలను మారుస్తూ త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. నవంబర్1 నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ఎస్‌ఏ-1 పరీక్షలు జరగనున్నాయి. ఎస్‌ఏ-1 కూడా పదోతరగతికి 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించేలా అధికారులు షెడ్యూలు రూపొందించారు.


 


:: Read Also ::


TS NMMS: తెలంగాణ ఎన్‌ఎంఎంఎస్ నోటిఫికేషన్ వచ్చేసింది! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను  నేషనల్‌ మీన్స్  కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్ (NMMS) పరీక్ష డిసెంబరు 12న నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబ‌రు 28 వరకు గడువు ఉంది. తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్ష ప్రశ్నపత్రాలు ఉంటాయి. ప్రతి రెవెన్యూ డివిజన్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి, దరఖాస్తు చేసుకోవచ్చు.
స్కాలర్‌షిప్, దరఖాస్తు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..



AP NMMS: ఏపీ ఎన్ఎంఎంఎస్ నోటిఫికేషన్ విడుదల, ఎంపిక ఇలా!

ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ఉపకారవేతనాన్ని అందిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రకటనను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం తాజాగా విడుదల చేసింది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు వీరికి స్కాలర్‌షిప్ అందుతుంది.
స్కాలర్‌షిప్, దరఖాస్తు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..



COVID Scholarships: కొవిడ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్, వీరికి ప్రత్యేకం!!

ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ ఫౌండేషన్‌ సామాజిక బాధ్యతలో భాగంగా కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల కోసం ‘కొవిడ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ను ప్రకటించింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌, డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ చదివే వారు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల నుంచి విద్యార్థుల పరిస్థితిని అంచనావేసి షార్ట్‌లిస్ట్‌ రూపొందిస్తారు. తర్వాత వీరికి టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ నిర్వహించి, ఎంపికైనవారికి స్కాలర్‌షిప్ అందజేస్తారు.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..