Telangana Inter 1st Year and 2nd Year Hall Ticket 2025 | హైదరాబాద్: తెలంగాణలో మార్చి 5 నుంచి ఇంటర్‌ ఫస్టియర్ పరీక్షలు, మార్చి 6 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు (Telangana Inter Board Exams) ప్రారంభం కానున్నాయని తెలిసిందే. ఎగ్జామ్స్ నిర్వహణలో భాగంగా ఇంటర్‌ బోర్డు అధికారులు హాల్‌టికెట్లను విడుదల చేశారు. వెబ్‌సైట్‌ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఇంటర్ విద్యార్థులకు సూచించారు. మొదట కాలేజీల లాగిన్‌లలో ఉంచిన అధికారులు.. ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రెగ్యూలర్ తో పాటు బ్రిడ్జి కోర్సు విద్యార్థులకు పరీక్షల హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌/ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ (Date Of Birth) వివరాలను ఎంటర్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఇంటర్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు మార్చి 5న ప్రారంభం కాగా, మార్చి 24 తేదీన ముగియనున్నాయి. మార్చి 6 నుంచి ప్రారంభం కానున్న ద్వితీయ సంవత్సరం పరీక్షలు 25వ తేదీన ముగియనున్నాయని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకారం ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందుకోసం ఇంటర్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు..

పరీక్ష తేదీ వారం పేపర్
05.03.2025  బుధవారం సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్-1
07.03.2025  శుక్రవారం ఇంగ్లిష్ పేపర్ పేపర్-1
11.03.2025  మంగళవారం మాథ్స్ పేపర్ 1ఎ, బోటని పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
13.03.2025  గురువారం మ్యాథ్స్ పేపర్ 1బి, జువాలజి పేపర్-1, హిస్టరీ పేపర్-1
17.03.2025  సోమవారం ఫిజిక్స్ , ఎకనామిక్స్
19.03.2025  బుధవారం కెమిస్ట్రీ , కామర్స్
21.03.2025  శుక్రవారం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-1(బైపీసీ విద్యార్థులకు)
24.03.2025  సోమవారం మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్ -1

ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు..

పరీక్ష తేదీ వారం పేపర్
06.03.2025  గురువారం సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్-2
10.03.2025  సోమవారం ఇంగ్లిష్ పేపర్-2
12.03.2025  బుధవారం మాథ్స్ పేపర్ 2ఎ, బోటని పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2
15.03.2025  శనివారం మ్యాథ్స్ పేపర్ 2బి, జువాలజి పేపర్-2, హిస్టరీ పేపర్-2
18.03.2025  మంగళవారం ఫిజిక్స్ , ఎకనామిక్స్
20.03.2025  గురువారం కెమిస్ట్రీ , కామర్స్
22.03.2025  శనివారం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు)
25.03.2025  మంగళవారం మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2