తెలంగాణలో నవంబర్ 1 నుంచి జరుగనున్న సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ-1) పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను అక్టోబరు 12న పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం 9, 10వ తరగతి విద్యార్థులకు ఆరు పేపర్లు ఉంటాయని అందులో పేర్కొన్నారు. అయితే అప్పటికే కొన్ని జిల్లాల్లో ఆ జిల్లా విద్యాధికారుల ఆదేశాల మేరకు 11 పేపర్లకుగాను ప్రశ్నపత్రాలను ప్రింటింగ్ చేశారు. అయితే ఆరు పేపర్లే ఉంటాయని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొనడంతో కొత్తగా మళ్లీ ప్రశ్నపత్రాలను రూపొందించాల్సి ఉంటుంది.
Read Also: TSBIE: ఈ ఏడాది 100 శాతం సిలబస్‌తో పరీక్షలు, ఇంటర్ బోర్డు ప్రకటన!
దీంతో వెనక్కి తగ్గిన అధికారులు నవంబర్ 1 నుంచి జరిగే ఎస్‌ఏ-1కు మాత్రం 11 పేపర్లకు పరీక్షను నిర్వహించేలా, ఎస్‌ఏ-2, ఎస్‌ఎస్‌సీ వార్షిక పరీక్షలకు మాత్రం 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించేలా అక్టోబరు 19న మళ్లీ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. అధికారుల తీరు, అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో గందరగోళం ఏర్పడింది. మారిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు ఎస్‌ఏ-1 పరీక్షలను ఒకటి నుంచి పదోతరగతి విద్యార్థులు రాయనున్నారు. ఉదయం ఒక పేపర్, మధ్యాహ్నం మరో పేపర్‌కు పరీక్షలు నిర్వహించేలా అధికారులు షెడ్యూల్‌ను రూపొందించారు.
Read Also: TS NMMS: తెలంగాణ ఎన్‌ఎంఎంఎస్ నోటిఫికేషన్ వచ్చేసింది! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో పదోతరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి పదోతరగతి పరీక్షలను 6 పేపర్లతోనే నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 పేపర్లతో పదోతరగతి పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. హిందీ మినహా మిగతా సబ్జెక్టులకు రెండు పేపర్లు చొప్పున పరీక్షలు ఉంటున్నాయి. అయితే గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా ఆరు పేపర్ల విధానాన్ని అమలు చేశారు. కరోనా కారణంగా రెండేళ్ళ పాటు విద్యార్ధులకు పరీక్షల నిర్వహణలో రకరకాల సమస్యలు తలెత్తాయి. విద్యార్ధులు ఎలాంటి పరీక్షలు లేకుండానే 8,9 తరగతుల నుంచి ఉత్తీర్ణులై పదిలోకి వచ్చేశారు.
Read Also: AP NMMS: ఏపీ ఎన్ఎంఎంఎస్ నోటిఫికేషన్ విడుదల, ఎంపిక ఇలా!
పదోతరగతి పరీక్ష విధానంపై సమీక్ష జరిపిన NCERT విద్యార్థులకు 11 రోజుల పాటు పరీక్షలు నిర్వహించడం వల్ల వారిపై ఒత్తిడి పెరుగుతోందని, వాటిని ఆరు పేపర్లకు కుదించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 6 పేపర్ల విధానానికే మొగ్గు చూపింది. పదో తరగతి విధి విధానాలను మారుస్తూ త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. నవంబర్1 నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ఎస్‌ఏ-1 పరీక్షలు జరగనున్నాయి. ఎస్‌ఏ-1 కూడా పదోతరగతికి 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించేలా అధికారులు షెడ్యూలు రూపొందించారు.
Read Also: COVID Scholarships: కొవిడ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్, వీరికి ప్రత్యేకం!!
తెలంగాణలో ఈసారి పదోతరగతి వార్షిక పరీక్షలకు ఎప్పటిలాగా 11 పేపర్లే ఉంటాయని సెప్టెంబరులో పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంటే ఒక్క హిందీకి తప్ప మిగిలిన అయిదు సబ్జెక్టులకు రెండు పేపర్లు (పరీక్షలు) ఉంటాయి. ఈసారి సాధారణ పరిస్థితులే ఉన్నందున సిలబస్ కూడా తగ్గించలేదని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం నుంచి సిలబస్ పేపర్లను తగ్గించాలని తమకు ఆదేశాలు లేవని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఆదేశాలతో ఇకపై పదోతరగతి పరీక్షలను 6 పేపర్లతోనే నిర్వహించనున్నారు. గత మే నెలలో జరిగిన వార్షిక పరీక్షలను ఆరు పేపర్లతోనే నిర్వహించిన విషయం తెలిసిందే.