TS SSC Supplementary Exam Hall Tickets Download | హైదరాబాద్‌: తెలంగాణలో టెన్త్ క్లాస్ పరీక్షల్లో విద్యార్థులకు అప్ డేట్ వచ్చింది. పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు వచ్చేశాయి. జూన్‌ 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ పరీక్షల హాల్ టికెట్లను ఇదివరకే స్కూళ్లకు పంపించారు. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్

విద్యార్థులు హాల్ టికెట్లను స్కూల్ నుంచి గానీ, లేక బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్ నుంచి సైతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.  మొత్తం 42,832 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేశారని ఆయన తెలిపారు.

ఏప్రిల్ 30న విడుదలైన టెన్త్ ఎగ్జామ్స్ ఫలితాలలో 92.78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాలను https://telugu.abplive.com/exam-results తో పాటు results.bse.telangana.gov.in , www.results.bsetelangana.org వెబ్‌సైట్లలో విద్యార్థులు రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు.

రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతము 92.78 % ఉంది. - బాలుర ఉత్తీర్ణతా శాతము 91.32 %, బాలికలు 94.26 %. బాలుర కంటే బాలికలు 2.94% అధికంగా ఉత్తీర్ణత సాధించారు.

ప్రైవేట్ విద్యార్ధుల ఉత్తీర్ణతా శాతము 57.22 % ఉంది. - బాలురు సాధించిన ఉత్తీర్ణతా శాతము 55.14 %, బాలికలు 61.70 % పాసయ్యారు. బాలుర కంటే బాలికలు 6.56 % అధికంగా ఉత్తీర్ణత సాధించారు.

ఈ సంవత్సరము రెగ్యులర్ విద్యార్థులు  4,629 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. 02 పాఠశాలలు 0 శాతము ఫిలితాలు తెచ్చాయి. 98.79 శాతంతో తెలంగాణ గురుకుల పాఠశాలలు అత్యధిక ఉత్తీర్ణతా శాతంతో టాప్ లో నిలిచాయి.