Telangana SSC Supplementary Exam Date 2025: తెలంగాణలో టెన్త్ విద్యార్థుల ఫలితాలు వచ్చేశాయ్. పరీక్షలు పూర్తయిన నాలుగు వారాల తరువాత తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి ఫలితాలు విడుదల చేసింది. తెలంగాణలో టెన్త్ పరీక్షలకు హాజరైన వారిలో శాతం మంది ఉత్తీర్ణులయ్యారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రెగ్యూలర్ విద్యార్థులతో పాటు ఓపెన్ టెన్త్ ఫలితాలు రిలీజ్ చేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన టెన్త్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల తేదీలపై క్లారిటీ ఇచ్చారు. జూన్ 3వ తేదీ నుంచి జూన్ 13 తేదీల వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని షెడ్యూల్ విడుదల చేశారు. టెన్త్ విద్యార్థులు https://telugu.abplive.com/exam-results తో పాటు results.bse.telangana.gov.in , www.results.bsetelangana.org వెబ్‌సైట్లలో రిజల్ట్ చెక్ చేసుకునే అవకాశం ఉంది.
ముఖ్యమైన తేదీలివే..
విద్యార్థులు ప్రిన్సిపాల్ కు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మే 16
ప్రిన్సిపాల్ ఆన్‌లైన్లో ఫీజులు చెల్లించాల్సిన చివరి తేదీ మే 17
కంప్యూటర్ ముద్రించిన ఎన్‌ఆర్ లతో జిల్లా విద్యాశాఖ అధికారికి సమర్పించాల్సిన తేదీ మే 20
విద్యాశాఖ అధికారి ప్రభుత్వ పరీక్షల విభాగానికి ఎన్.ఆర్ సమర్పించాల్సిన చివరి తేదీ మే 22
రూ.50 ఆలస్య రుసుముతో పరీక్షలకు రెండు రోజుల ముందు వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది.
విద్యార్థులకు సమాచార కోసం:
1. ఈ ప్రకటన ద్వారా ప్రకటించిన రోల్ నంబర్ల జాబితా ప్రొవిజనల్ జాబితా మాత్రమే.
2. పాఠశాలల నుండి మరియు సంబంధిత పరీక్ష కేంద్రాల నుండి కొంత సమాచారము రావలసియున్నందున కొంత మంది విద్యార్థుల ఫలితాలు విత్ హెల్డ్ లో ఉంచబడినవి. ఇట్టి ఫలితాలు త్వరలోనే ప్రకటించబడును.
3. మార్కుల రీకౌంటింగ్:
మార్కులు తిరిగి లెక్కించాలని కోరే విద్యార్థులు సబ్జెక్టుకు రూ.500/- చొప్పున పరీక్షా ఫలితాలు విడుదలైనప్పటి నుంచి 15 మే లోగా హెడ్ ఆఫ్ అకౌంట్ క్రింద చలాన ద్వారా చెల్లించి వారి దరఖాస్తులను ఈ కార్యాలయమునకు నేరుగా కానీ లేదా పోస్టు ద్వారా కానీ పంపించవచ్చు.
0202 Education, Sports, Arts & Culture
01 General Education
102 Secondary Education
06 Director of Government Exams
800 యూజర్ ఛార్జీలు
4. రీవెరిఫికేషన్, ఆన్సర్ షీట్ల కాపీ కోసం:
అభ్యర్థులు సంబంధిత పాఠశాలలో హాల్ టికెట్ జిరాక్స్ కాపీ, కంప్యూటరైజ్డ్ ప్రింటెడ్ మెమో కాపీతో పాటు రీ-వెరిఫికేషన్ దరఖాస్తును సమర్పించాలి. స్కూల్ ప్రిన్సిపాల్ ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేసిన, D.E.O. కార్యాలయానికి సమర్పించిన దరఖాస్తులు మాత్రమే అంగీకరిస్తారు. S.S.C. బోర్డుకు పోస్ట్ ద్వారా పంపిన దరఖాస్తులు ఆమోదించరు.
దరఖాస్తు ఫారమ్ S.S.C. బోర్డు వెబ్సైట్ అంటే www.bse.telangana.gov.in లో ఉంచుతారు. ఈ దరఖాస్తులను జిల్లా విద్యా శాఖాధికారి నుండి సైతం పొందవచ్చు. అభ్యర్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ. 1000/- మొత్తాన్ని ఈ క్రింద తెలిపిన హెడ్ ఆఫ్ అకౌంట్ కి మాత్రమే వ్యక్తిగత చలాన్ ద్వారా చెల్లించాలి.
0202 Education, Sports, Arts & Culture
01 General Education
102 Secondary Education
06 Director of Government Exams
800 User Charges
విద్యార్థుల నుండి రీ-వెరిఫికేషన్ మరియు జిరాక్స్ కాపీల కోసం నింపిన దరఖాస్తు మే 12 వరకు మాత్రమే అంగీకరించనున్నారు.
1. ఆన్సర్ సీట్లు పునఃపరిశీలన కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మార్కుల రీకౌంటింగ్ కొరకు దరఖాస్తు చేయనవసరం లేదు.
2. డిమాండ్ డ్రాఫ్ట్ లు అంగీకరించరు.
ఇంటర్నెట్ లో ఫలితములు పొందుటకు వివరాలు: ఎస్ఎస్‌సీ మార్చి-2025 పరీక్షల ఫలితాలు పొందాలనుకున్న విద్యార్థులు ఈ క్రింద తెలుపబడిన ఇంటర్నెట్ వెబ్ సైట్ల నుండి 15 రోజులలోపు పొందవచ్చును.
టెన్త్ ఫలితాలలో ఈ ఏడాది మార్పులు జరిగాయి. మార్కులకు బదులుగా గ్రేడ్ లు ఇచ్చి పాస్ అయినట్లు మాత్రమే మెమోలో కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంటలకు విడుదల కావాల్సిన టెన్త్ ఫలితాలు కాస్త ఆలస్యమయ్యాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ పర్యటన సహా కొన్ని కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉన్నందన బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చాయనో, ఫెయిల్ అయ్యామనో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఫెయిలైన విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులతో పాస్ కావాలని సూచించారు.
ఈ ఏడాది 2,650 సెంటర్లు ఏర్పాటు చేసి టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించారు. మార్చి 21నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించగా.. ఏప్రిల్ 30న ఫలితాలు విడుదల చేశారు.