TG SSC Results | హైదరాబాద్: తెలంగాణలో టెన్త్ విద్యార్థుల ఫలితాలపై మరో అప్డేడ్ వచ్చింది. పదో తరగతి ఫలితాలు మధ్యాహ్నం 1 గంటలకు విడుదల కావడం లేదు, మరికాస్త ఆలస్యం కానున్నాయి. గంట 15 నిమిషాలు ఆలస్యంగా పదో తరగతి ఫలితాలు రిలజ్ చేయనున్నట్లు సమాచారం వచ్చింది. బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఆందోళన చెందకూడదని అధికారులు ఫలితాలపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులు  https://telugu.abplive.com/ తో పాటు  www.results.bsetelangana.org , https://www.bse.telangana.gov.in/  వెబ్‌సైట్లలో రిజల్ట్ చెక్ చేసుకునే అవకాశం ఉంది.

Continues below advertisement


 



 ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,650 కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాది ఇంటర్నల్స్ కొనసాగించారు. ఇంటర్నల్స్ విధానాన్ని రద్దు చేాయాలని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఆలస్యం కావడంతో ఈ ఏడాదికి అలాగే కొనసాగించారు. 2026 పరీక్షల నుంచి ఇంటర్నల్స్ ఉండవు. మొత్తం రాతపరీక్షకు 100 మార్కులు కేటాయించినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.


ఫలితాల ఆలస్యానికి కారణం ఇదేనా..


కంకిపాడు : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో పర్యటిస్తున్నారు. విజయవాడ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, మచిలీపట్నం ఎంపి వల్లభనేని బాలసౌరి స్వాగతం పలికారు. కంకిపాడులో మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడు వివాహానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన దంపతులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వదించారు.


విజయవాడకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి మద్యాహ్నం ఒంటి గంటకు తిరిగి శంషాబాద్ చేరుకుంటారు. అనంతరం మొయినాబాద్, గుడి మల్కాపూర్ లో జరుగుతున్న వివాహా వేడుకలకు రేవంత్ హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 2.15 కి  రవీంద్రభారతిలో పదో తరగతి ఫలితాలను ఆయన విడుదల చేస్తారని అధికారులు తెలిపారు.  అనంతరం రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో సీఎ రేవంత్ రెడ్డి పాల్గొంటారు.