TS SSC Results 2022 Live Updates: తెలంగాణ టెన్త్ రిజల్ట్స్‌లో భారీగా ఉత్తీర్ణత శాతం, ఇక్కడ ఒకే క్లిక్‌తో రిజల్ట్స్ చెక్ చేస్కోండి
Telangana SSC Results నేడు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలు విడుదల చేస్తారు. లైవ్ అప్ డేట్స్ కోసం ఈ పేజీ ఫాలో అవండి.
ABP Desam Last Updated: 30 Jun 2022 12:03 PM
Background
తెలంగాణలో విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న పదో తరగతి పరీక్ష ఫలితాలు ఇవాళ రానున్నాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల ప్రాంగణంలో ఈ ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. సీడీలో ఫలితాలు ఉంచిన...More
తెలంగాణలో విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న పదో తరగతి పరీక్ష ఫలితాలు ఇవాళ రానున్నాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల ప్రాంగణంలో ఈ ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. సీడీలో ఫలితాలు ఉంచిన అధికారులు దాన్ని మంత్రితో విడుదల చేయిస్తారు. అనంతరం పాస్ వర్డ్ కూడా విడుదల చేయిస్తారు. అనంతరం ఫలితాలను ఏబీపీ దేశం వెబ్‌సైట్(telugu.abplive.com), bse.telangana.gov.inలో చూసుకోవచ్చు. జూన్ మొదటి వారంలో ముగిసిన పరీక్షలుతెలంగాణలో పదో తరగతి పరీక్షల కోసం లక్షల మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మే 28న జరిగిన సాంఘిక పరీక్షతో 2021-22 సంవత్సరానికి చెందిన పరీక్షలు ముగిశాయి. చివరి రోజు పరీక్షకు మొత్తం 5,03,114 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులకు జూన్ 1 న చివరి పరీక్ష జరిగింది. ఆ మరుసటి రోజు నుంచి అంటే జూన్ 2 నుంచి తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభించారు. కరోనా కారణంగా చాలా మార్పులు తెలంగాణలో మే 23న ప్రారంభమైన టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ మే 28తో ముగిశాయి. గతేడాది వరకు పదో తరగతి పరీక్షల్లో 11 పేపర్ల పరీక్షలు ఉండేవి. కరోనా వ్యాప్తి తర్వాత పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. అందుకే రెండేళ్లు నేరుగా విద్యార్థులను తరువాత తరగతులకు ప్రమోట్ చేశారు. ఈ ఏడాది పదకొండు పేపర్లకు బదులుగా 6 పేపర్లకు పరిమితం చేయడంతో ఒకే వారంలో పరీక్షలు పూర్తయ్యాయి. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్ పెంచారు.ముందు చెప్పినట్టుగానే ఈ ఏడాది 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 99 శాతం మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. 2,861 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత త్వరగా స్పాట్ వాల్యుయేషన్ పూర్తి చేసి నెలాఖరులోగా ఫలితాలు విడుదల చేయనున్నట్టు మొదట్లోనే అధికారులు ప్రకటించారు.తెలంగాణ ఫలితాలు ఎలా చూడాలిఏబీదేశం వెబ్‌సైట్ telugu.abplive.comలోకి లేదా bse.telangana.gov.in వెళ్లాలి.టాప్‌లో TS SSC Results 2022 కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాలి. లేదా ప్రభుత్వం సూచించిన ఏదైనా వెబ్‌సైట్‌నైనా క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.మీకు రిజిస్టర్ నెంబర్ అడుగుతుంది. అందులో మీ పరీక్ష రిజిస్టర్ నెంబర్ టైప్ చేయాలి. తర్వాత రిజల్ట్స్‌పై క్లిక్ చేయండి. వెంటనే మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది. అందులో ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ ఫలితాన్ని సేవ్ చేసుకోవచ్చు. ప్రింట్ తీసుకోవచ్చు. తదుపరి అవసరం కోసం హార్డ్ కాపీని మీ వద్దే ఉంచండి.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Tenth Exams Results Pass Percentage: పది ఫలితాల్లో ఈ జిల్లానే టాప్
- తెలంగాణ పదవ తరగతి ఫలితాలు విడుదల
- ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- బాలికలు 92.45 శాతం , 87.61 శాతం పాస్
- బాలికలు, బాలుర కంటే 4.84 శాతం అధికంగా ఉత్తీర్ణత
- పదవ తరగతి ఫలితాల్లో రికార్డ్ స్థాయిలో ఉత్తీర్ణత
- 90 శాతం పాస్ అయిన విద్యార్థులు
- సిద్దిపేట జిల్లా 97.85 శాతంతో మొదటి స్థానంలో, 79.63 శాతం తో హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉన్నాయి
- ఆగస్ట్ ఒకటి నుంచి పదవ తరగతి అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు
- 01.08.22 నుంచి 10.08.22 వరకు జరగనున్న అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు