టీఎస్ పీఈసెట్-2023 ఫ‌లితాలు జూన్ 24న విడుద‌లయ్యాయి. ఉన్నత విద్యామండ‌లి ఛైర్మన్‌ ప్రొఫెస‌ర్ లింబాద్రి, శాత‌వాహ‌న విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెస‌ర్ మ‌ల్లేష్ తదితరులు ఫలితాలను విడుద‌ల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫ‌లితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పీఈసెట్ ఫ‌లితాల్లో 96.50 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైన‌ట్లు వెల్లడించారు. బీపీఎడ్‌లో 96.65 శాతం, డీపీఎడ్‌లో 96.18 శాతం ఉత్తీర్ణత న‌మోదైన‌ట్లు పేర్కొన్నారు. బీపీఎడ్ ఫ‌లితాల్లో జ‌న‌గామ‌కు చెందిన జి. దేవ ప్రథ‌మ ర్యాంకు సాధించ‌గా, డీపీఎడ్‌లో న‌ల్లగొండ జిల్లాకు చెందిన ఎన్. ప్రవ‌ళిక ప్రథ‌మ ర్యాంకు సాధించారు. 16 బీపీఎడ్ కాలేజీల్లో 1660 సీట్లు, నాలుగు డీపీఎడ్ కాలేజీల్లో 350 సీట్లు ఉన్న‌ట్లు పీఈసెట్ క‌న్వీన‌ర్ వెల్లడించారు.


పీఈసెట్ ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి..


ALSO READ: 


అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులు - వివరాలు ఇలా!
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ), బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 31లోపు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
కోర్సుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


సీపీగేట్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి, ఏ పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీగేట్‌ పరీక్షల షెడ్యూలును ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. దీనిప్రకారం జూన్ 30 నుంచి జులై 10 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజు మూడు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. కేటాయించిన సీట్ల కంటే తక్కువ దరఖాస్తులు అందినందున ఈసారి ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠి, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్ కోర్సులకు పరీక్షలు నిర్వహించట్లేదు. సీపీగెట్ పరీక్షకు పోటీపడే అభ్యర్థుల సంఖ్య ఈసారి స్వల్పంగా పెరిగింది. గతేడాది ఈ పరీక్షకు 67,117 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది ఈ సంఖ్య 69,439కి పెరిగింది.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..