Janasena Symbol :   జనసేన పార్టీకి గాజు గ్లాస్ సింబర్ ఖరారైందన్న ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ అభిమానులు కూడా ఇదే చెబుతున్నారు. ఎన్నికల సంఘం రాష్ట్ర పార్టీగా గుర్తించిందని చెబుతున్నారు. నిజానికి ఈ గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది అసెంబ్లీ ఎన్నికలకు కాదు. రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే.. అందులో జనసేన పోటీ చేస్తే.. అప్పుడు గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేయవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే గుర్తును ఖరారు చేసేది  మాత్రం ఎస్‌ఈసీ కాదు..  భారత ఎన్నికల సంఘం. 


స్థానిక ఎన్నికల వరకు జనసేనకు గాజు గ్లాస్ గుర్తు 


ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తును కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఏపీఎస్‌ఈసీ) ఉత్తర్వులు జారీచేసింది. జనసేనను రిజర్వుడు సింబల్‌ కలిగిన రిజిస్టర్డ్‌ పార్టీల జాబితాలోనే ఉంచింది. టీడీపీ, వైసీపీ  లను గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో వాటి గుర్తులతో కొనసాగించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీని గుర్తింపుపొందిన జాతీయపార్టీగా, సీపీఐ, ఎన్‌సీపీలను గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలుగా జాబితాలో చేర్చింది. బీఆర్ఎస్  ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో ఉండేది. ఆ పార్టీ కొత్త పేరు, వివరాలతో ఏపీఎస్‌ఈసీ వద్ద దరఖాస్తు చేసుకుంటే ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో చేర్చి కారు గుర్తు కొనసాగించనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి కేఆర్‌బీహెచ్‌ఎన్‌ చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశారు


అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అసలు క్లారిటీ 


ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులు స్థానిక ఎన్నికల వరేక ఉపయోగపడతాయి. అసెంబ్లీ ఎన్నికల వరకూ వచ్చే సరికి కేంద్ర ఎన్నికల సంఘం  ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.  ఇప్పటికే జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. సినీ నటుడు పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో పోటీ చేసినా సీట్లు రాలేదు. గెలిచిన ఒక వ్యక్తి కూడా వైఎస్‌ఆర్‌సీపీకి మద్దుతు తెలిపారు. గుర్తింపు పొందడానికి సింబల్‌ను కాపాడుకోవడానికి అసరమైనన్ని  ఓట్లతోపాటు సీట్లు కూడా దక్కించుకోలేక పోయిందా పార్టీ. దీంతో ఆ పార్టీ సింబల్ ను ఎన్నికల సంఘం ఫ్రీ సింబర్ కేటగిరీలో చేర్చింది. ప్రాంతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఆరు శాతం, రెండు స్థానాలను దక్కించుకోవాలి. కానీ గత ఎన్నికల్లో జనసే పార్టీ వీటిని సాధించలేకపోయింది. ఓట్లు శాతం ఆరుగా ఉన్నప్పటికీ... కేవలం ఒకే ఒక్క సీటును కైవసం చేసుకుంది. మరో స్థానాన్ని కూడా జనసేన గెలుచుకొని ఉంటే ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందేది. 25 లోక్ సభ స్థానాల్లో ఒక్క ఎంపీ సీటును గెలుచుకున్నా ప్రాంతీయ పార్టీ హోదా దక్కేది. కానీ మరో స్థానం గెలుచుకోలేకపోయినందున జనసేన పార్టీ గుర్తును.. ప్రీ సింబల్ జాబితాలోకి చేర్చారు. 


అసెంబ్లీ ఎన్నికల్లోనూ గాజు గ్లాస్ సింబల్ కేటాయించే చాన్స్ ! 
 
అయితే జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు పొందేంత ఓట్లు, సీట్లు రాని కారణంగా జనసేనకు గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్స్ కేటగిరిలో గతంలో కేంద్ర ఎన్నికల సంఘం చేర్చింది. అయితే ఇది నిబంధనల ప్రకారమే అలా చేశారని.. ఆ గుర్తు వేరే పార్టీలకు ఇచ్చే అవకాశం లేదని ఎన్నికల నిపుణులు చెబుతున్నారు. జనసేన రిక్వెస్ట్ పెట్టుకుంటే తమ పార్టీ అభ్యర్థులందరికీ అదే గుర్తు కావాలని అడిగితే కేటాయిస్తారు. అయితే జనసేన పార్టీ పోటీ చే్యని చోట్ల ఇతరులకు అడిగితే గాజు గ్లాస్ కేటాయిస్తారు. అప్పుడు జనసేన అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. తిరుపతి ఉపఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు కూడా బరిలో ఉంది. అప్పట్లో బీజేపీ అభ్యరంతరం వ్యక్తం చేసినా ఈసీ పట్టించుకోలేదు. 


నిజానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తుంది. అయినా గుర్తు విషయంలో ఇబ్బంది పెట్టలేకపోయారు. మరి కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఎందుకు పెడుతుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.