తెలంగాణ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (టీఎస్‌ పీఈసెట్‌-2022) నిర్వహణకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ అన్ని ర‌కాల ఏర్పాట్లు పూర్తి చేసింది. సెప్టెంబరు 21న రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం నాలుగు జిల్లాల్లో 6 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో ఫిజికల్‌ ఈవెంట్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,632 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇప్పటి వరకు మొత్తం 3,552 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.


హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


సెప్టెంబరు 21న ఉదయం 7 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు. ఎంజీయూలో పరీక్షల ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి హాజరు కానున్నారు. అదేవిధంగా ప్రత్యేక కేటగిరి (ఎన్‌సీసీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, స్పోర్ట్‌ అండ్‌ గేమ్స్‌ తదితర) అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పరీక్షా కేంద్రాల‌కు చేరుకోవాల‌ని సూచించారు. ఒకే రోజు పురుషులకు, మహిళలకు వేర్వేరుగా పరీక్షలు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. సెట్‌ చైర్మన్‌గా ఎంజీయూ వీసీ ప్రొఫెసర్‌ సీహెచ్‌.గోపాల్‌రెడ్డి, కన్వీనర్‌గా ఎంజీయూ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డీన్‌ ప్రొఫెసర్‌ వి.సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. 



పరీక్ష కేంద్రాలు ఇవే..



  1. మహాత్మాగాంధీ యూనివర్సిటీ, నల్లగొండ


  2. శ్రీకృష్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, శ్రీనాథపురం, అనుముల మండలం, నల్లగొండ జిల్లా


  3. ఎంఎంఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, చౌటుప్పల్‌, యాదాద్రి భువనగిరి జిల్లా


  4. సిద్దార్థ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, వినోభానగర్‌, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా


  5. వాగ్దేవి కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, బొల్లికుంట, వరంగల్‌ అర్బన్‌ జిల్లా


  6. వేదా కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, కొండపాక, సిద్దిపేట



Also Read:

ఐసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యతేదీలివే!
తెలంగాణ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ సెప్టెంబరు 19న విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబర్‌ 10 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఐసెట్-2022 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 10 నుంచి 13 వరకు ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. అక్టోబర్‌ 10 నుంచి 15వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు. ఇక వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు అక్టోబరు 18న ఎంబీఏ, ఎంసీఏ అభ్యర్థులకు మొదటి విడుదల సీట్లు కేటాయించనున్నారు.
ఐసెట్ పూర్తి కౌన్సెలింగ్ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..




Also Read:

జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..