తెలంగాణలోని న్యాయ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవే‌శాల కోసం నిర్వహించిన టీఎస్‌ లాసెట్‌ ఫలి‌తాలు ఆగస్టు 17న కాను‌న్నాయి. మధ్యాహ్నం 4 గంటలకు ఉన్నత విద్యా‌మం‌డలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, వైస్‌ చైర్మన్‌ ప్రొఫె‌సర్‌ వెంక‌ట‌ర‌మణ, ఓయూ వైస్‌ చాన్స్‌‌లర్‌ ప్రొఫె‌సర్‌ డీ రవీం‌దర్‌ ఫలితాలను విడు‌దల చేయనున్నారు. ర్యాంకులు, ఫలి‌తాల కోసం విద్యా‌ర్థులు వెబ్‌‌సై‌ట్‌ చూడవచ్చు. మూడేళ్లు, అయిదేళ్ల పీజీ లాసెట్‌ జులై 21, 22 తేదీల్లో జరిగింది. ఈ పరీక్షలకు మొత్తం 35,538 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 28,921 మంది హాజరయ్యారు. ఫలితాల ఆధారంగా అభ్యర్థులకు ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో సీట్లు కేటాయించనున్నారు.

ఫలితాలు, ర్యాంకు కార్డు కోసం వెబ్‌సైట్

తెలంగాణ లాసెట్‌, పీజీఎల్‌సెట్ 2022 పరీక్ష కోసం అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఉస్మానియా వర్సిటీ పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. ఎల్‌ఎల్‌బీ (LLB) 3, 5 సంవత్సరాలు, ఎల్‌ఎల్‌ఎం (LLM) రెండు సంవత్సరాల కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్, పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలను జులై 21, 22 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. జులై 26న ప్రాథమిక కీ విడుదల చేసి 28 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఫలితాలతో పాటు ర్యాంకు కార్డులు, ఫైనల్ కీ కూడా విడుదల చేయనున్నారు. పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా, కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థుల ఆప్షన్ల మేరకు సంబంధిత కళాశాలల్లో సీట్లు కేటాయిస్తారు.

క్వాలిఫై మార్కులు, ర్యాంకిగ్ విధానం ఇలా..
ఏపీ లాసెట్ అర్హత సాధించాలంటే 35 శాతం కనీస మార్కులు తప్పనిసి. 120 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 42 మార్కులు సాధించిన వారిని ర్యాంకింగ్ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకుంటారు. ప్రవేశపరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా తుది జాబితాను రూపొందిస్తారు. మార్కుల సమానమయ్యే అభ్యర్థులకు సెక్షన్-సిలో వచ్చిన మార్కులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా సమమైతే అభ్యర్థుల వయోపరిమితి ఆధారంగా తుదిజాబితాను విడుదల చేస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు అవసరంలేదు.

పీజీఎల్ సెట్ అర్హత సాధించాలంటే 25 శాతం కనీసం మార్కులు తప్పనిసరి. 120 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 30 మార్కులు సాధించిన వారిని ర్యాంకింగ్ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకుంటారు. ప్రవేశ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా తుది జాబితాను రూపొందిస్తారు. మార్కుల సమమయ్యే అభ్యర్థులకు పార్ట్-ఎలో వచ్చిన మార్కులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా సమానమైతే అభ్యర్థుల వయోపరిమితి ఆధారంగా చేసుకుని తుదిజాబితాను విడుదల చేస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు అవసరంలేదు.

TS LAWCET 2022 Notification


Also Read:
బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పాఠశాల విద్యార్థుల చదువుల కోసం ఆర్థికంగా ఆసరా  ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రంట్ ఇండియా (YASASVI) ప్రవేశ పరీక్ష-2022 నిర్వహణకు గాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న పాఠశాల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  యశస్వి అనేది ఇతర వెనుకబడిన తరగతి (ఓబీసీ), ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ), డీ-నోటిఫైడ్, నోమాడిక్ & సెమీ నోమాడిక్ ట్రైబ్స్ (డీఎన్‌టీ/ ఎస్ఎన్‌టీ) వర్గాలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన స్కాలర్‌షిప్ పథకం. 
అర్హతలు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..



Also Read:
మైనార్టీ’ ఉపకార వేతనాలకు దరఖాస్తులు
తెలంగాణలో మైనార్టీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్, మెరిట్ ఉపకార వేతనాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ప్రీమెట్రిక్ విద్యార్థులు సెప్టెంబరు 30లోగా.. ఇంటర్, ఆ పైన చదివే పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.


మైనారిటీ విద్యార్థులు 2022-23 విద్యా సంవత్సరానికి నేషనల్ మైనార్టీస్ ఫ్రీ మెట్రిక్ (1వ తరగతి నుంచి 10వ తరగతి), పోస్ట్ మెట్రిక్ విభాగంలో ఇంటర్మీడియట్ నుంచి పీహెచ్‌డీ గవర్నమెంట్ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ కాలేజీలు, ఐ.టి.ఐ లేదా ఐ.టి.సి టెక్నికల్ కోర్సులు, గ్రాడ్యూయేట్, పోస్ట్ గ్రాడ్యూయేట్, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న మైనారిటీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 


ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్
-2008లో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకం
-కేంద్రం 75 శాతం నిధులను సమకూరుస్తుంది.
-కేంద్రపాలిత ప్రాంతాలకు 100 శాతం నిధులను ఇస్తుంది.


పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్
-2007లో ప్రారంభించారు.
-100 శాతం కేంద్రమే నిధులను సమకూరుస్తుంది.
-2007లో మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ స్కాలర్‌షిప్‌ని ప్రారంభించారు. ఈ పథకం టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులను ఉద్దేశించింది.


Website


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..