TS Intermediate 1st Year Results 2022: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. జూన్ 28న ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలవుతాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు (TS Inter 1st Year Results 2022: )ను నేటి ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి జలీల్ ఇటీవల తెలిపారు. తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నాయి. విద్యార్థులు ఫలితాలను telugu.abplive.com, tsbie.cgg.gov.in  వెబ్ సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు. 


4.6 లక్షల మంది విద్యార్థుల ఫలితాలు
షెడ్యూల్ ప్రకారం మే 6 నుంచి 23 వరకు తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ ఏడాది తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,07,396 మంది హాజరుకాగా.. ఇందులో ఫస్టియర్ విద్యార్థులు 4,64,626 మంది ఉన్నారు. మొత్తం 1,443 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి 25 వేల మంది ఇన్విజిలేటర్లు, 150 మంది సిట్టింగ్ స్క్వాడ్, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో పరీక్షలు పటిష్టంగా నిర్వహించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి


70 శాతం సిలబస్..
కరోనా వ్యాప్తితో గత రెండేళ్లు తెలంగాణ, ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహణకు ఆటంకాలు ఏర్పడ్డాయి. కానీ ఈ ఏడాది పరిస్థితులు అనుకూలించడంతో క్లాసులు ఆలస్యంగా నిర్వహించారు. ఈ సారి 30 శాతం సిలబస్ తగ్గించారు. ఇంటర్ ప‌రీక్ష‌లను కేవలం 70 శాతం సిలబస్ నుంచి నిర్వహించారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడంతో ఫలితాలు ఎలా రాబోతున్నాయని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లోనూ ఉత్కంఠతో పాటు ఆందోళన నెలకొంది.


టీఎస్ ఇంటర్ ఫలితాలు 2022 ఈ విధంగా తెలుసుకోండి (Steps to check TS Inter 1st Year Results 2022)
Step 1: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్  https://tsbie.cgg.gov.in ను సందర్శించండి
Step 2: హోం పేజీలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2022 లింక్ మీద క్లిక్ చేయండి
Step 3: హాల్ టికెట్ నెంబర్ (రిజిస్ట్రేషన్ నెంబర్), పుట్టిన తేదీ లాంటి వివరాలు విద్యార్థులు ఎంటర్ చేయాలి
Step 4: ఇంటర్ విద్యార్థుల ఫస్టియర్ ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి
Step 5: విద్యార్థులు రిజల్ట్స్‌ను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవాలి
Step 6: భవిష్యత్ అవసరాల కోసం మీ ఫలితాలను ప్రింటౌట్ తీసుకోవడం మరిచిపోవద్దు


Also Read: TS Inter Results 2022:  తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల - రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే


Also Read: TS Inter 2nd Year Results 2022: తెలంగాణలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి