Inter Supplementary Results: తెలంగాణలో మే 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు జూన్ 25న విడుదల కానున్నాయి. గత పరీక్షల మూల్యాంకనంలో తప్పులు జరిగిన నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం విద్యార్థుల మార్కుల డీకోడింగ్, ఆన్‌లైన్‌లో మార్కుల నమోదు ప్రక్రియ పూర్తికావచ్చింది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోపే ఫలితాలను వెల్లడించడానికి ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఏవైనా అవాంతరాలు ఏర్పడితే మరో ఒకటి లేదా రెండు రోజులు ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే అవకాశం ఉంది.  ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాత ఫలితాలను అప్‌లోడ్ చేశారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబు పత్రాలను మూడేసి సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్, డీకోడింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. 


ఈ ఏడాది ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలతోపాటు, ఫస్టియర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం రాసిన విద్యార్థులు దాదాపు 4.5 లక్షల మంది వరకు ఉన్నారు. ఇప్పటికే ఎప్‌సెట్ పరీక్ష ఫలితాలు వెల్లడి కావడం, మరోవైపు దోస్త్ రెండు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇంటర్ పాసైన విద్యార్థులు ఎప్‌సెట్ అర్హత ఉంటే.. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి అర్హత పొందుతారు. ఎప్‌సెట్ అర్హత లేనవారు దోస్త్ ద్వారా డిగ్రీ కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది.


ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఇలా చూసుకోండి..


➥ ఫలితాల కోసం విద్యార్థులు మొదట ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.- https://tsbie.cgg.gov.in/  


➥ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ మే/జూన్ - 2024 ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి. 


➥ అక్కడ వచ్చే పేజీలో విద్యార్థులు తమ  హాల్‌టికెట్ నెంబర్‌తో పాటు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి SUBMIT బటన్‌పై క్లిక్ చేయాలి.


➥ వివరాలు నమోదుచేయగానే విద్యార్థి మార్కుల వివరాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.


➥ విద్యార్థులు తమ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ఫలితాల కోసం వెబ్‌సైట్..


ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు (TS Inter Exams) నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలకు మొత్తం 9.80 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 4.78 లక్షల మంది ఇంటర్ మొద‌టి సంవత్సరం విద్యార్థులు, 4.43 లక్షల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. ఇక ఒకేషనల్ కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 46,542 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాలను ఏప్రిల్ 24న ఒకేసారి విడుదల చేశారు. తెలంగాణ ఇంటర్ ఫస్టియర్‌లో 60.01 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్ విద్యార్థులు 64.19 శాతం పాసయ్యారు. సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను కూడా ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఒకేసారి వెల్లడించే అవకాశం ఉంది.


ALSO READ:


ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల రీవెరిఫికేషన్‌కు అవకాశం, ఎప్పటినుంచి ఎప్పటివరకంటే? 
ఏపీలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలకు సంబంధించిన జూన్ 18న ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఫలితాలను ఇంటర్ బోర్డు వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా ఇంటర్ ప్రథమ సంవత్సం సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 26న విడుదల చేయనున్నారు. ఫలితాలపై ఏమైనా సందేహాలుంటే రీవెరిఫికేషన్‌ కోసం అవకాశం కల్పించారు. విద్యార్థులు జూన్ 20 నుంచి 24 వరకు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..