AP IAS Officers Transfer List ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వేళ ఐఏఎస్ అధికారుల బదిలీలు భారీగా జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
వీరిలో వై. శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాశ్ ను ప్రస్తుతం ఉన్న పోస్టుల నుంచి వైదొలగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారు తమ తర్వాతి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వీరు ముగ్గురిపై గతంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.
శ్రీలక్ష్మి ఇప్పటి వరకూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉండగా.. రజత్ భార్గవ రెవెన్యూ శాఖలో అదనపు ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ప్రవీణ్ ప్రకాశ్ పాఠశాల విద్యాశాఖకు ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.
ఐఏఎస్ ల బదిలీల జాబితా
పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జీఏడీకి అటాచ్
ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ జీఏడీకి అటాచ్
పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ జీఏడీకి అటాచ్
జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి - సాయిప్రసాద్
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి - శశిభూషణ్ కుమార్
వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి - రాజశేఖర్
కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి - గోపాలకృష్ణ ద్వివేది
పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి - అనిల్ కుమార్ సింఘాల్
పౌరసరఫరాలశాఖ కమిషనర్ - సిద్ధార్థ్ జైన్
ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి - సౌరభ్ గౌర్
నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి - సౌరభ్ గౌర్ కు అదనపు బాధ్యతలు
పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి - కోన శశిధర్
ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శి - కోన శశిధర్ కు పూర్తి అదనపు బాధ్యతలు
ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శి - బాబు.ఎ
ఏపీ సీఆర్డీఏ కమిషనర్ - కాటమనేని భాస్కర్
ముఖ్యమంత్రి కార్యదర్శి - ప్రద్యుమ్న
ఆర్థికశాఖ వ్యయ విభాగం కార్యదర్శి - ఎం.జానకి
పశుసంవర్థకశాఖ కార్యదర్శి - ఎం.ఎం.నాయక్
గనులశాఖ కమిషనర్, డైరెక్టర్ - తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్
ఏపీఎండీసీ ఎండీ - ప్రవీణ్ కుమార్ కు అదనపు బాధ్యతలు
తిరుపతి జేసీకి జిల్లా కలెక్టర్ - పూర్తి అదనపు బాధ్యతలు
ఆర్థికశాఖ కార్యదర్శి - వి.వినయ్ చంద్
జీఏడీకి రిపోర్ట్ చేయాలని మురళీధర్ రెడ్డికి ఆదేశాలు