Inter Supplemetary Halltickets: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఇంట‌ర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వ‌ర‌కు ఇంట‌ర్ రెండో సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి. ఇక ఇప్పటికే సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. విద్యార్థులు తమ రూల్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  


ఇంటర్మీడియట్ విద్యార్థులకు థియరీ పరీక్షలు ముగిశాక.. జూన్ 4 నుంచి 8 వ‌ర‌కు ప్రాక్టిక‌ల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు.  ఇక ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జూన్ 10న ఇంగ్లిష్ ప్రాక్టిక‌ల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉద‌యం 9 గంట‌ల‌ నుంచి పరీక్ష నిర్వహిస్తారు.  ఇక ఇంటర్నల్ పరీక్షలకు సంబంధించి.. జూన్ 11న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేష‌న్ పరీక్ష, జూన్ 12న ఎథిక్స్ అండ్ హ్యుమ‌న్ వాల్యూస్ పరీక్షలు నిర్వహించ‌నున్నారు. ఆయా తేదీల్లో ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు పరీక్షలు జరుగనున్నాయి.


Inter First Year Hall Tickets


Inter Second Year Hall Tickets


Inter Bridge Course Hall Tickets 


ఇంటర్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు ఇలా..


➥ 24 (శుక్రవారం): సెకండ్ లాంగ్వేజ్ పేప‌ర్-1.


➥ మే 25 (శనివారం): ఇంగ్లిష్ పేప‌ర్-1.


➥ మే 28 (మంగళవారం): మ్యాథమెటిక్స్ పేప‌ర్-1ఎ, బోట‌ని పేప‌ర్-1, పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్-1.


➥ మే 29 (బుధవారం): మ్యాథమెటిక్స్ పేప‌ర్-1బి, జువాల‌జీ పేప‌ర్-1, హిస్టరీ పేప‌ర్-1.


➥ మే 30 (గురువారం): ఫిజిక్స్ పేప‌ర్-1, ఎకాన‌మిక్స్ పేప‌ర్-1.


➥ మే 31 (శుక్రవారం): కెమిస్ట్రీ పేప‌ర్-1, కామ‌ర్స్ పేప‌ర్-1.


➥ జూన్ 1 (శనివారం): ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ పేప‌ర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-1 (బైపీసీ విద్యార్థులకు).


➥ జూన్ 3 (సోమవారం): మోడ్రన్ లాంగ్వేజ్ పేప‌ర్-1, జియోగ్రఫీ పేప‌ర్-1.


ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు..


➥ మే 24 (శుక్రవారం): సెకండ్ లాంగ్వేజ్ పేప‌ర్-2.


➥ మే 25 (శనివారం): ఇంగ్లిష్ పేప‌ర్-2.


➥ మే 28 (మంగళవారం): మ్యాథమెటిక్స్ పేప‌ర్-2ఎ, బోట‌ని పేప‌ర్-2, పొలిటిక‌ల్ సైన్స్ పేప‌ర్-2.


➥ మే 29 (బుధవారం): మ్యాథమెటిక్స్ పేప‌ర్-2బి, జువాల‌జీ పేప‌ర్-2, హిస్టరీ పేప‌ర్-2.


➥ మే 30 (గురువారం): ఫిజిక్స్ పేప‌ర్-2, ఎకాన‌మిక్స్ పేప‌ర్-2.


➥ మే 31 (శుక్రవారం): కెమిస్ట్రీ పేప‌ర్-2, కామ‌ర్స్ పేప‌ర్-2.


➥ జూన్ 1 (శనివారం): ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ పేప‌ర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-2 (బైపీసీ విద్యార్థులకు).


➥ జూన్ 3 (సోమవారం): మోడ్రన్ లాంగ్వేజ్ పేప‌ర్-2, జియోగ్రఫీ పేప‌ర్-2.


VOCATIONAL SECOND YEAR TIME TABLE IPASE MAY 2024


VOCATIONAL TIMETABLE FIRST YEAR IPASE MAY 2024


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..