తెలంగాణ ఇంటర్ బోర్డు 9 రోజులపాటు దసరా సెలవులను ప్రకటించింది. షెడ్యూలు ప్రకారం అక్టోబరు 2 నుంచి 9 వరకు దలసరా సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. అక్టోబరు 10న కళాశాలలు తిరిగి తెరచుకోనున్నాయి. రాష్ట్రంలోని అన్ని  ప్రైవేట్‌, ఎయిడెడ్‌, ప్రభుత్వ ఇంటర్ కళాశాలలకు అక్టోబర్‌ 2 నుంచి 9 వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు దసరా సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. సెలవురోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠినచర్యలు ఉంటాయని కళాశాలలను హెచ్చరించింది.


తెలంగాణలోని పాఠశాలలకు ప్రభుత్వం ఇప్పటికే దసరా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పాఠశాలలకు సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 8 వరకు మొత్తం 13 రోజుల సెలవులు ప్రకటించింది. అయితే సెప్టెంబరు 25, అక్టోబరు 9 ఆదివారాలు ఉండటంతో మొత్తంగా 15 రోజుల సెలవులు వచ్చినట్లయింది. 



ఏపీలో సెలవులు ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు అక్టోబరు 26 నుంచి అక్టోబరు 6 వరకు దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబరు 13న అధికారిక ప్రకటన చేసింది. సెప్టెంబరు 25న ఆదివారం కావడంతో మొత్తం 12రోజులు సెలవులు రానున్నాయి. ఇక క్రిస్టియన్‌, ఇతర మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబరు 1 నుంచి 6 వరకు సెలవులు ఇచ్చారు.


సెలవుల తర్వాత ఫార్మెటివ్‌-1 పరీక్షలు..
సెలవుల తర్వాత ఫార్మెటివ్‌-1 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఓమ్మార్‌ షీట్‌తో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓఎమ్మార్‌ షీట్ల ముద్రణ పూర్తికాకపోవడంతో పరీక్షలను వాయిదా వేస్తూ వస్తున్నారు. పాఠశాల స్థాయిలో నిర్వహించే పరీక్షలకు రూ.కోట్లు వెచ్చించి, ఓఎమ్మార్‌ షీట్లు ముద్రించడంపై విమర్శలు వస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఇవే..
♦ ఈ ఏడాది విద్యార్థులకు సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబరు 6 వరకు దసరా సెలవులు. 
♦ క్రిస్టియన్‌ మైనారిటీ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబరు 1 నుంచి 6వ తేదీ వరకు ఇస్తారు. 
♦ క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ ఇస్తారు.
♦ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు ప్రకటించింది.


 


Read Also:


Pragathi Scholarship: మహిళా 'ప్రతిభ'కు చేయూత 'ప్రగతి' స్కాలర్‌షిప్‌!! దరఖాస్తు చేసుకోండి, అర్హతలివే!
మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘ప్రగతి స్కాలర్‌షిప్‌’  నోటిఫికేషన్‌ వెలువడింది.  ‘ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ)’ ఏటా ఈ ఉపకారవేతనం అందిస్తోంది. డిప్లొమా, డిగ్రీ కోర్సులు చదువుతున్న అర్హులైన అమ్మాయిలకు ఈ స్కీమ్ కింద ఆర్థికసాయం అందిస్తారు. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు.  ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సరైన అర్హతలున్న మహిళలు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా స్కాలర్‌షిప్ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..



బీఎస్సీ-నర్సింగ్, బీపీటీ కోర్సులకు దరఖాస్తు చేసుకోండి, పూర్తి వివరాలు ఇలా!

బీఎస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ నర్సింగ్, బీపీటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 22న ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు బీఎస్సీ నర్సింగ్, రెండేళ్ల డిగ్రీ కోర్సు పోస్ట్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్, ఫిజియోథెరపీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
ప్రవేశ ప్రకటన, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..



జాతీయ సంస్కృత వర్సిటీలో డిగ్రీ కోర్సులు, వివరాలు ఇలా!
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సీయూఈటీ - 2022 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆన్‌లైన్ విధానంలో అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  
కోర్సులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


 


విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..