తెలంగాణ ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులకు అధికారులు అక్టోబరు 19న సాయంత్రం సీట్లు కేటాయించారు. తాజా కేటాయింపులతో కలిపి ఎంబీఏలో 22,679, ఎంసీఏలో 4,396 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 83.83 శాతం సీట్లు నిండాయి. ఇంకా ఎంబీఏలో 4,272, ఎంసీఏలో 952 సీట్లు మిగిలిపోయాయి. ప్రత్యేక విడతలో సీట్లు పొందిన వారు ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించి అక్టోబరు 20 నుంచి 29 వరకు సంబంధిత కళాశాలకు సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం అక్టోబరు 30, 31 తేదీల్లో కళాశాలల్లో నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కళాశాలలో ధ్రువపత్రాలను మరోసారి పరిశీలించి సీటు కేటాయింపును యాజమాన్యం ధ్రువీకరిస్తుంది.
టీఎస్‌ఐసెట్ కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్ల భర్తీకి 'ప్రత్యేక విడత' కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 15న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అభ్యర్థులు అక్టోబర్ 15న ప్రాథమిక సమాచారం ఆన్‌లైన్ ఫైలింగ్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ చేసుకున్నారు. అక్టోబర్ 16న ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. అక్టోబర్ 16 నుంచి 17 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 17న వెబ్ ఆప్షన్లు ఫ్రీజింగ్‌కు అవకాశం కల్పించారు. వెబ్‌ఆప్షనలు నమోదుచేసుకున్నవారికి అక్టోబర్ 19న సీట్లను కేటాయించారు.
కాలేజీలవారీగా సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..
30న స్పాట్ అడ్మిషన్ వివరాలు..
టీఎస్‌ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 30తో ముగియనుంది. దీంతో అదేరోజు స్పాట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. మూడు విడదల కౌన్సెలింగ్ అనంతరం ఎంబీఏలో 4,272, ఎంసీఏలో 952 సీట్లు మిగిలాయి. స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా ఈ సీట్లను భర్తీ చేయనున్నారు.
ALSO READ:
డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీలో యూజీ ఆయుష్ ప్రవేశాలు, ముఖ్యమైన తేదీలు ఇలా
విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీలో కాంపీటేటివ్ అథారిటీ కోటా కింద యూజీ ఆయుష్ (బీఏఎంస్, బీహెచ్‌ఎంస్, బీయూఎంస్) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ అర్హతతోపాటు నీట్ యూజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 17 నుంచి 21 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నీట్ యూజీ కటాఫ్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ పాసైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, దరఖాస్తుకు డిసెంబరు 31 వరకు గడువు
తెలంగాణలో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులై... ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు 'నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్'కు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్ అక్టోబరు 6న ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబరు 31 వరకు గడువు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇంటర్ మార్కుల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలిచిన 53,107 మంది ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆయన పేర్కొన్నారు. కొత్త విద్యార్థులతోపాటు గతంలో స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన వారు కూడా రెన్యువల్ కోసం డిసెంబరు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
స్కాలర్‌షిప్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..