తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన 'టీఎస్ ఈసెట్-2023' కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 29 నుంచి ప్రారంభంకానుంది. టీఎస్ఈసెట్ ప్రవేశ పరీక్షలో 45 శాతం మార్కులు కలిగిన ఓసీ ఆభ్యర్థులు, 40 శాతం మార్కులు ఇతర అభ్యర్థులు కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.
రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన అభ్యర్థులకు జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఇక ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినవారు జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఆగస్టు 8న తొలి విడత సీట్లను కేటాయిస్తారు. తదనంతరం మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఆగస్టు 20 నుంచి తుది విడత ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. ఆగస్టు 26న తుది విడత సీట్లను కేటాయిస్తారు. ఇక చివరగా.. ఆగస్టు 28న అభ్యర్థులకు స్పాట్ ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూలు..
➥ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్: 29.07.2023 - 01.08.2023.
➥ ధ్రువపత్రాల పరిశీలన: 31.07.2023 - 02.08.2023.
➥ వెబ్ ఆప్షన్ల నమోదు: 31.07.2023 - 04.08.2023.
➥ ఆప్షన్ల ఫ్రీజింగ్: 04.08.2023.
➥ తుది విడత సీట్ల కేటాయింపు: 08.08.2023.
➥ ట్యూషన్ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: 08.08.2023 - 12.08.2023.
రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలు..
➥ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్: 20.08.2023 - 21.08.2023 వరకు
➥ ధ్రువపత్రాల పరిశీలన: 22.08.2023
➥ వెబ్ ఆప్షన్ల నమోదు: 20.08.2023 - 23.08.2023 వరకు
➥ ఆప్షన్ల ఫ్రీజింగ్: 23.08.2023.
➥ తుది విడత సీట్ల కేటాయింపు: 26.08.2023.
➥ ట్యూషన్ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: 26.08.2023 - 29.08.2023 వరకు
➥ సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 26.08.2023 - 30.08.2023 వరకు
➥ స్పాట్ ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల: 28.08.2023
కౌన్సెలింగ్ పూర్తి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు జులై 13న విడుదలైంది. ఆగస్టు 14 నుంచి 18 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. ఆగస్టు 16 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 16 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 25న తొలి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి తుది విడత ఐసెట్ కౌన్సెలింగ్ ఉంటుంది. సెప్టెంబరు 1 నుంచి 3 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు, 7న తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 8న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
ఓయూ దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ ప్రకటన విడుదల - దరఖాస్తుకు చివరితేది ఎప్పుడంటే?
ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ప్రొఫెసర్ రామిరెడ్డి దూరవిద్య కేంద్రం (ఓయూసీడీఈ) ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.900 చెల్లించి జులై 28 నుంచి ఆగస్టు 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రూ.500 ఆలస్య రుసుముతో ఆగస్టు 18 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా కోర్సు్ల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రవేశ పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..