TS EAPCET 2024 Counselling Schedule: తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్ ఎప్‌సెట్ -2024 కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి మే 24న ప్రకటించింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో మే 24 సమావేశమైన ప్రవేశాల కమిటీ ఈమేరకు కౌన్సెలింగ్ షెడ్యూలును ఖరారుచేసింది. కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందే విద్యార్థులు పదోతరగతి, ఇంటర్ మార్కుల మెమోలు, టీసీ, ఇన్‌కం, క్యాస్ట్ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని కమిటీ సూచించింది. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్  కోర్సుల్లో ప్రవేశాలు చేప‌ట్టనున్నారు. మొత్తం మూడు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మొదటి విడత కౌన్సెలింగ్ జూన్ 27 నుంచి జులై 12 వరకు నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు జూన్ 30 నుంచి వెబ్‌ ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లను నమోదుచేసుకున్నవారికి జులై 12న మొదటి విడత సీట్లను చేటాయిస్తారు. ఆ తర్వాత రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను జులై 19 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. ఈ దశలో జులై 19 నుంచి వెబ్ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. అనంతరం జులై 24న రెండో విడత సీట్లను కేటాయిస్తారు. ఇక చివరగా మిగిలిన సీట్ల భర్తీకి జులై 30 నుంచి ఆగస్టు 5 వరకు చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అయితే ఇంటర్నల్ స్లైడింగ్ ఆన్‌లైన్‌లో కన్వీనర్ ద్వారా చేపట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇందుకుగాను ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆగస్టు 16న ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయించనున్నారు. అదేవిధంగా స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను ఆగస్టు 17న విడుదల చేయనున్నారు. 

టీఎస్ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూలు..

సందర్భం తేదీ
ఇంజినీరింగ్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం 27.06.2024
మొదటి విడత వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం 30.06.2024
మొదటి విడత సీట్ల కేటాయింపు 12.07.2024
రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం 19.07.2024
రెండో విడత సీట్ల కేటాయింపు 24.07.2024
తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం 30.07.2024
తుది విడత సీట్ల కేటాయింపు 05.08.2024
ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభం 12.08.2024
ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయింపు 16.08.2024
స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల 17.08.2024

ALSO READ:

AP EAPCET: ఏపీ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఎప్‌సెట్ పరీక్షలు మే 23తో ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీని విడుదల చేసిన అధికారులు మే 24న ఉదయం 10 గంటలకు ఇంజినీరింగ్ విభాగానికి నిర్వహించిన పరీక్షల ఆన్సర్ కీని, మాస్టర్ క్వశ్చన్ పేపర్లను, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో వాటిని అందుబాటులో ఉంచారు. ఆన్సర్ ‘కీ’ పై మే 26న ఉదయం 10 గంటల వరకు అభ్యంతరాలు తెలపడానికి అవకాశం ఇచ్చారు. 
ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్, అభ్యంతరాల నమోదు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..