తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఆగస్టు 12న విడుదలయ్యాయి. ఎంసెట్-2022 ఇంజి‌నీ‌రింగ్‌, అగ్రి‌క‌ల్చర్‌, మెడి‌కల్‌ ఫలి‌తా‌లను విద్యా‌శాఖ మంత్రి సబి‌తా‌ ఇం‌ద్రా‌రెడ్డి ఉద‌యం 11.20 గంట‌ల‌కు జేఎన్టీయూలో విడు‌దల చేశారు. ఎంసెట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఎసెంట్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో 88.34 శాతం ఉత్తీర్ణులయ్యారు. 

ఎంసెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో లక్ష్మీసాయి లోహిత్ రెడ్డికి మొదటి ర్యాంకు, సాయిదీపికకు రెండోర్యాంకు, కార్తికేయకు మూడో ర్యాంకు కైవసం చేసుకోగా.. మెడికల్ విభాగంలో నేహా మొదటి ర్యాంకు, రోహిత్ రెండోర్యాంకు, తరుణ్ కుమార్ మూడో ర్యాంకు పొందారు.

TS EAMCET 2022 Result

TS EAMCET 2022 Rank Cards


ఇతర వెబ్‌సైట్ లింక్ ద్వారా ఫలితాలు.. 

TS EAMCET Results 2022 (Engineering)

TS EAMCET Results 2022 (AM) 

రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు జులై 18 నుంచి 20 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగాలకు, అదేవిధంగా జులై 30, 31 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. మూడు రోజుల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు సంబంధించి మొత్తం 1,72,243 మంది విద్యార్థులు ఎంసెట్ ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకోగా, కేవలం 1,56,812 మంది మాత్రమే హాజరయ్యారు. 9 శాతం విద్యార్థులు పరీక్ష రాయలేదు. ఇక ఎంసెట్ మెడికల్ విభాగానికి మొత్తం 94,476 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 80,575 (85.3 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. 



Also Read:
తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి!

ఇప్పటికే ఎంసెట్-2022 పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ కీలను అధికారులు విడుదల చేశారు. కీపై  విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. తుది సమాధానాలతో పాటు ఫలితాలను ఎంసెట్ కమిటీ విశ్లేషించి, ఆగస్టు 12న ఫలితాలను విడుదలచేశారు. 

వాస్తవానికి ఎంసెట్ పరీక్ష జులై 14, 15 తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా.. భారీ వర్షాల కారణంగా జులై 18 నుంచి 20 వరకు రెండు విడతలుగా పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలు విడుదలైన అనంతరం మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ల వేరిఫికేషన్ అనంతరం వెబ్ ఆఫ్షన్లు ఇస్తారు. అనంతరం సీట్ల కేటాయింపు ఉండనుంది.


ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థులు తమ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు.
.

Step 1: అభ్యర్థులు మొదటగా https://eamcet.tsche.ac.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం హోం పేజీలో EAMCET Results 2022 సంబంధించిన లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి. 
Step 3: అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి SUBMIT పై క్లిక్ చేయాలి.
Step 4: తర్వాత మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ కాపీని ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి. 



Also Read:  


విద్యార్థులకు అలర్ట్, స్కాలర్‌షిప్‌ రిజిస్ట్రేషన్లు అప్పటినుంచే!
తెలంగాణలో 2022-23 విద్యాసంవత్సరానికి పోస్టుమెట్రిక్‌ స్కా లర్‌షిప్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగుల ఈ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త స్కాలర్‌షిప్‌, రెన్యూవల్‌ కోసం కాలేజీలు, విద్యార్థులు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ఈ-పాస్ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 15 నుండి అక్టోబర్ 15 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. SC, STకి చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.2 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. BC, EBC లేదా వికలాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలంటే వారి ఆదాయం సంవత్సరానికి రూ.1 లక్ష లేదా అంతకంటే తక్కువ ఉండాలి. దరఖాస్తు చేసుకునే విద్యార్థి హాజరు శాతం ప్రతి త్రైమాసికం చివరిలో 75 శాతంగా ఉండాలి. 
ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..