TS EAMCET Result 2021 LIVE: టీఎస్ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండిలా..

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్‌ విభాగాల పరీక్షలు ఈ నెల 4, 5, 6 తేదీల్లో జరిగాయి. విద్యార్థులు తమ ఫలితాలను eamcet.tsche.ac.in వెబ్‌సైట్లో చూసుకోవచ్చు. 

ABP Desam Last Updated: 25 Aug 2021 11:25 AM
ఫలితాలు వచ్చేశాయ్..

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు కాసేపటి క్రితం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్ ఫలితాలను eamcet.tsche.ac.in వెబ్‌సైట్లో చూడవచ్చు.

ఫలితాలు చెక్ చేసుకోండిలా..

  1. eamcet.tsche.ac.in లింక్‌ను తెరవండి. 

  2. టీఎస్ ఎంసెట్ రిజల్ట్స్ లింక్ మీద క్లిక్ చేయండి. 

  3. మీ రిజిస్ట్రేషన్ నంబర్, టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేయండి. 

  4. స్క్రీన్ పై ఫలితాలు కనిపిస్తాయి. భవిష్యత్ అవసరాల కోసం వీటిని డౌన్‌లోడ్ చేసుకోండి.

మొరాయించిన వెబ్‌సైట్..

TS EAMCET Result LIVE: విద్యార్థులంతా ఎంసెట్ ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. మరికాసేపట్లో ఫలితాలు విడుదల కానున్నాయి. ఎక్కువ మంది ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేస్తుండటంతో సైట్ స్థంభించింది. టీఎస్ ఎంసెట్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్న వారికి ఎర్రర్ మెసేజ్ దర్శనమిస్తోంది. 

TS EAMCET Result: 2,51,606 మంది విద్యార్థులు

TS EAMCET Result: ఎంసెట్ పరీక్షలకు మొత్తం 2,51,606 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగానికి 1,64,962 మంది.. మెడికల్, అగ్రికల్చర్ విభాగాలకు 86,644 మంది అప్లై చేసుకున్నారు. 

TS EAMCET Result LIVE: 70 నుంచి 80 మార్కులు వస్తే..

TS EAMCET Result 2021 LIVE: ఈ ఏడాది తరగతులు, పరీక్షలు లేకుండానే ఇంటర్మీడియట్‌ ఫలితాలను ప్రకటించినందున ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజిని తొలగించారు. దీంతో ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకులను ఖరారు చేస్తారు. ఈ ఏడాది ఎంసెట్‌లో 70 నుంచి 80 మార్కులు వస్తే 10 వేల ర్యాంకుకు అటూఇటూగా వస్తుందని అంచనా వేస్తున్నారు.  

TS EAMCET Result 2021 LIVE: సెప్టెంబర్ 1 లేదా 2న అగ్రికల్చర్ ఫలితాలు

TS EAMCET Result LIVE Updates: ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలను సెప్టెంబర్ 1 లేదా 2వ తేదీన విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. వ్యవసాయ, ఫార్మసీ ఎంసెట్ పరీక్షలు ఈ నెల 9, 10 తేదీల్లో జరిగాయి. 

TS EAMCET Result LIVE Updates: సెప్టెంబరు 15 నుంచి సీట్ల కేటాయింపు..

ఇంజనీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాలను కూడా అధికారులు వెల్లడించారు. ఇంజనీరింగ్ మొదటి విడత సీట్లను సెప్టెంబరు 15వ తేదీన కేటాయించనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 15 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని విద్యార్థులకు సూచించారు. అయితే రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను మాత్రం వెల్లడించాలేదు. త్వరలోనే ఈ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. 

Background

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఈరోజు (ఆగస్టు 25) ఉదయం 11 గంటలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎ.గోవర్ధన్‌ తెలిపారు. టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్‌ పరీక్షల ఫలితాలను మాత్రమే నేడు విడుదల చేయనున్నారు. వ్యవసాయ, ఫార్మసీ ఎంసెట్ ఫలితాలను తర్వాత వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. కాగా, టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్‌ విభాగాల పరీక్షలు ఈ నెల 4, 5, 6 తేదీల్లో జరిగాయి. విద్యార్థులు తమ ఫలితాలను eamcet.tsche.ac.in వెబ్‌సైట్లో చూసుకోవచ్చు. 


టీఎస్ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారైంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలిపారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 9 వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ధ్రువపత్రాల పరిశీలన.. సెప్టెంబరు 4 నుంచి 11వ తేదీ వరకు జరుగుతుందని పేర్కొన్నారు. వెబ్ ఆప్షన్లకు సెప్టెంబరు 4 నుంచి 13వ తేదీ వరకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.